పుట:1857 ముస్లింలు.pdf/233

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

1860 నాటికి ఫిరోజ్‌ షా కాందాహార్‌ చేరుకుని, అక్కడ నుండి 1862 లో టెహరాన్‌ వెళ్లారు. మార్గమధ్యంలో పలువురు రాజ్యాధినేతలను కలసి తమ విముక్తి పోరాటానికి సహాయం కోరారు. అతి కష్టం మీద సేకరించిన ధనంలో ఆయుధాలను సమకూర్చు కునేందుకు లక్ష రూపాయలను అమెరికాకు పంపారు. ఆయుధాలు అందక పోవటమే కాదు అక్కడకు పంపిన ధనం కూడ ఏమైందో ఆ తరువాత అంతుపట్టకుండా పోయింది.

ఈ లోగా ఫిరోజ్‌షా ప్రయత్నాలను తెలుసుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం సరిహద్ధు దేశాధినేతలకు లేఖలు రాసి ఫిరోజ్‌కు ఏవిధంగానూ సహకరించవద్దంది. ఆయన మీద గ ట్టి నిఘా ఏర్పాటు చేసి, కదలికలను గమనించసాగింది. బ్రిటిషర్ల కన్నుగప్పి కార్యకలా పాలు సాగించటం ఫిరోజ్‌కు కష్టమైపోయింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. విరామమెరుగక సాగుతున్న సంచారం వలన సరైన ఆహారం, తగినంత విశ్రాంతి కరువు కావటంతో అనారోగ్యంతో పాటుగా, కంటిచూపు తగ్గింది. రోజురోజుకూ బలపడుతున్న బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల బలాన్ని ఎదుర్కోవటం అసాధ్యమైంది. బలపడిన సామ్రాజ్యవాద శక్తు ల ఆదేశాలను కాదని ఫరోజ్‌కు సహాయపడగల స్వతంత్ర శక్తులు లేకుండా పోయాయి.

చిగురంత ఆశను కల్గించే వాతావరణం కూడా కరువయ్యింది. అనారోగ్యం బాధిస్తుండగా చివరకు ఆయన 1875లో మక్కా చేరుకున్నారు. ఆ రాచ దంపతులను ఆదుకునే వారు కరువయ్యారు. భార్యాభరలకు కనీసం తిండీబట్టా కూడ కరువైపోయింది. ఆ సమయంలో ఆర్థిక సహాయం కోసం కనబడినవారినల్లా అర్థించారని చెబుతారు. ఆ దుర్భర పరిస్థితులలో కూడా ఫిరోజ్‌ షా ఆంగ్లేయ వ్యతిరేక చర్యలకు స్వస్తిపలుకలేదు. ఆ అవిశ్రాంత శ్రమ వలన చివరకు ఆయన కళ్ళే కాకుండా కాళ్ళు కూడా సహకరించడం మానేశాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టడం, మాతృదేశాన్నివదిలి పరదేశంలో తలదాచుకోవాల్సిన దుస్థితి రావడం ఆయనను కుంగదీసింది. ఆ వ్యధ నుండి ఆయన కోలుకోలేకపోయారు. చివరకు 1877 డిసెంబరు 8న మొగల్‌ రాకుమారుడు ఫిరోజ్‌ షా తన 45 సంవత్సరాల వయస్సులో మక్కాలో అంతిమ శ్వాస విడిచారు.

షెజాదా ఫిరోజ్‌ షా మరణాంతరం కష్టసుఖాల్లో సదా ఆయన వెంట నడిన ఆయన భార్యకు కష్టాలు తప్పలేదు. పరాజితులైనప్పటికి రాజకుటుంబీకులకు లభించే ఆర్థిక సదుపాయాలు లభించకపోవడం వలన చివరివరకు అతిదుర్భరమైన జీవితాన్ని గడుపుతూ కష్టాలు-కడగండ్ల సహవాసంతో ఆమె కన్నుమూశారు.

230