పుట:1857 ముస్లింలు.pdf/231

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

షేక్‌ మౌలా సాహెబ్‌, ఆయన సన్నిహిత మిత్రుడు, అలనాటి పరిటాల రిపబ్లిక్‌ అధ్య క్షులు మాదిరాజు దేవరాజు పరిటాల రిపబ్లిక్‌ ప్రకటించుకున్న నాటినుండి ఈనాటి వరకు జరిగిన విశేషాలను రచయితకు వివరించారు.

శిధిలావస్థలో ఉన్న చిన్న ఇంట్లో మౌలా సాహెబ్‌ దంపతులు ప్రస్తుతం నివసిస్తు న్నారు. కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకునే శక్తి మౌలాలో నశించటంతో, వృద్ధాప్యంలో పాత రిక్షాను మౌలా బ్రతుకు బండిగా మార్చుకున్నారు. ఓపిక ఉన్న రోజున జాతీయ రహదారి మీద పేడను సేకరిస్తారు . ఆ పేడతో పిడకలు చేస్తారు , ఎరువుగా మార్చుతారు. ఆ విధంగా తయారు చేసిన పిడకలను, ఎరువును రైతులకు అమ్ముకుని తద్వారా లభించినంతలో జీవిస్తుబన్నారు.

కంటి చూపు మందగించడంతో భారీ వాహనాలతో రద్దీగా ఉండే జాతీయ రహదారి మీద పేడ సేకరించటం ప్రాణాంతకంగా మారింది. పలుమార్లు ప్రమాదాల నుండి ఆయన తృటిలో తప్పించుకుని బ్రతికి బయటపడ్డారు. ఆ స్థితిలో కుటుంబీకులు కోపగించుకున్నాక, ఆ పని కూడా ప్రస్తుతం చేయటం లేదు. భార్య సంపాదన ప్రధాన ఆధారంగా జీవనయానం సాగిస్తున్నారు. ఆయన చేయగలిగిన పని ఉంటే చేసుకోవడం లేకుంటే గ్రామంలోని మసీదు లో ప్రార్ధన చేసుకుంటూ కాలం గడపటం ఆయన దినచర్య గా మారింది.

ఆనాడు అష్టకష్టాలుపడి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకోసం పోరాడినస్వాతంత్య్ర సమరయోధులు, వారి వారసులు ఎదుర్కొంటున్నదుస్థితికి మన రాష్ట్రానికి సంబంధించి నంత వరకు ఒక విషాద వాస్తవమిది. జాతీయ స్థాయి చరిత్రలోకి తొంగి చూస్తే ఇటువంటి విషాద యదార్ధాలు మన ముందుకు చాలా వస్తాయి.

1857 నాటి సంగ్రామం ఆరంభమైనప్పుడు మక్కాలో ఉన్న బహుదూర్‌ షా జఫర్‌ వారసులలో ఒకరైన షెహజాదా ఫిరోజ్‌ షా ఇండియాకు తిరిగి వచ్చి తనదంటూ సైన్యాన్ని తయారు చేసుకుని మాతృభూమి విముక్తి కోసం ఆంగ్ల సైన్యాలతో తలపడ్డారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ యోధులు తాంతియాతోపే, నానా సాహెబ్‌, అజీముల్లా ఖాన్‌, బేగం హరత్‌ మహాల్‌, మౌల్వీ అహమ్మదుల్లా ఫైజాబాది లాంటి మహాయోధులతో కలసి ఆయన ఆంగ్ల సెన్యాల మీద విరుచుకపడ్డారు. ఈ విజృంభణను తట్టుకోలేకపోయిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆయనను పట్టిచ్చినవారికి పదివేల

228