పుట:1857 ముస్లింలు.pdf/230

ఈ పుట ఆమోదించబడ్డది

త్యాగాలొకరివి-భోగాలొకరివి

రాజకీయాల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపలదు. ఆయన ఆర్థిక ప్రయాజనాల పట్ల ఎటువంటి ఉత్సుకత చూపలేదు . ఆయన తన గ్రామం వరకు పరిమితమయ్యారు. ఆయన సహచరులు రాజకీయంగా మంచి స్థానాలు సంపాదించుకున్నా ఆయన మాత్రం సామాన్యుడిగా మిగిలిపోయారు.

బ్రిటిషర్ల నుండి ఇటు నైజాం సంస్థానాధీశుల నుండి తమ గడ్డను స్వతంత్య్రం చేసుకోగలగడంలో సాహసోపేతంగా వ్యవహరించిన మౌలా సాహెబ్‌ తన కుటుంబాన్ని మాత్రం పేదరికం కోరల నుండి విముక్తం చేసుకోలేక పోయారు. నిజాం పోలీసుల తుపాకీ గుళ్ళకు, కరకు కత్తులకు, ఎత్తులకు భయపడని ధైర్యశాలి మౌలా పేదరికానికి

బెదిరిపోలేదు . రె క్కల కష్టంమీద ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగబిడ్డల షేక్‌ మౌలా సాహెబ్‌ గల భారీ కుటుంబాన్ని మోస్తూ కష్టాలతో

సహవాసం చేశారు. కాయకష్టం చేసు కుంటూ, కొండలెక్కి కట్టెలు కొట్టుకొచ్చి విక్రయించుకుని ఆ విధంగా లభించిన అత్తెసరి ఆదాయంతో బ్రతుకు బండిని నెట్టుకొచ్చారు. మౌలా దంపతులు తమ పిల్లలకు వివాహాలు చేశారు. వివాహాలు చేసుకున్న పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లా తమ జీవితాలను నిర్మించుకు నేందుకు తలోదిక్కూ వెళ్ళిపోయారు. మౌలా దాంపతులకు మళ్ళీ కాయకష్టం తప్పలేదు.

2002 ఏప్రిల్‌ 21న మౌలాసాహెబ్‌ గృహానికి రచయిత, ఇతర మిత్రులతో కలిసి వెళ్ళినప్పుడు ఆయన భార్య షేక్‌ మహబూబ్బీ చిల్లులు పడిన సత్తు పాత్రలో గొడ్డు కారం కలుపుకుని అన్నం తింటున్నారు. ఆ విషయం ఆమెతో ప్రస్తావించగా '..కూలి చేసుకు బ్రతుకుతున్నాం. కూలికి వెళ్ళకపోతే ఎలా? ఆయనకు కళ్ళు సరిగ్గా కనపటం లేదు . కూలీ-నాలీ చేయ లేక పోతున్నాడు. ఇద్దరం కష్టపడతనే కదా ముద్దనోట్లోకి వెళ్ళేది..' అని కట్టుకున్న చిరుగుల చీరను సరిచేసుకుంటూ కళ్లల్లో నీళ్ళను కొంగుతో ఒత్తుకుంటూ చెప్పారు.

227