పుట:1857 ముస్లింలు.pdf/229

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

జాగ్ ఉఠో యే హిందూస్థానీ జాగ్ ఉఠో
......................................
తుమ్‌ నా కిసీకే ఆగే ఝుక్‌నా
జర్మన్‌ హో యా జపానీ
.......................................
షురూహువాహై జంగ్ హమారా
జాగ్ ఉఠో యే హిందూస్థానీ జాగ్ ఉఠో '

ఆ పాటతో పులకరించి పోయిన పరిటాల రిపబ్లిక్‌ వీరులు స్వతంత్ర రిపబ్లిక్‌ పతాకానికి గౌరవ వందనం చేశారు. యుద్ధం ప్రారంభమైంది , మేల్కోండి భారతీయులారా మేల్కోండి..., అంటూ పాటలు పాడటమే కాదు, 1947నాటి చారిత్రాత్మక పరిటాల రిపబ్లిక్‌ స్థాపనలో మౌలా సాహెబ్‌ క్రియాశీలక పాత్రను పోషించారు.

ఆ సాహసోపేత చర్య వలన షేక్‌ మౌలా పేరు పరిటాల పరగణా అంతా వ్యాపించింది. ఆయనకు కడగండ్లు ఆరంభమయ్యాయి. నైజాం సంస్థానాధీశుడు మతం రీత్యా ముస్లిం కనుక ఆయనకు వ్యతిరేకంగా ముస్లింలెవ్వరూ వ్యవహరించ కూడదని మతపెద్దల నుండి తాఖీదులు అందాయి. ఆ ఆదేశాలను షేక్‌ మౌలా బే ఖాతర్‌ చేశారు. జాగీర్దార్‌ బలగాలు భౌతిక చర్యలకు సిద్ధమయ్యాయి. మౌలా లాంటి వ్యక్తుల మీద కారాలు మిరియాలు నూరారు. ఆ పరిస్థితిని గమనించిన తల్లితండ్రుల ఒత్తిడి మీద పొలాల్లో, పర్వత ప్రాంతాల్లో మౌలా కొంత కాలం రహస్య జీవితం గడిపారు.

భౌతిక దాడులకు లొంగక పోవటంతో నైజాం పాలకులు మార్గం మార్చు కున్నారు. మానసికంగా ఒత్తిడి తెచ్చి పరిటాల రిపబ్లిక్‌ను చిన్నాభిన్నం చేయడానికి కుయుక్తులు పన్నారు. షేక్‌ మౌలా సాహెబ్‌కు నయానా భయాన నచ్చచెప్పేందుకు నిజాం తాబేదారులు పరిటాల చేరు కున్నారు. మత పంచాయితి పెట్టి మౌలాకు వ్యతిరేకంగా తీర్మానం చేయించారు. ఒక సమయంలో నెత్తి మీద చెప్పులు పెట్టిఆయనను అవమానించారు. మౌలా సాహెబ్‌ కుటుంబాన్ని సాంఫిుక బహిష్కరణకు గురిచేశారు. ఈ దాష్టీకాలకూ, అవమానాలకూ మౌలా ఏ మాత్రం చలించలేదు.

చివరకు 1948 సెప్టెంబర్‌ మాసంలో నైజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది. అటు నైజాం విలీనం కాగానే ఇటు పరిటారిాల రిపబ్లిక్‌ కూడ ఇండియన్‌ యూనియన్‌లో భాగమై పోయింది. చిన్ననాటినుండే తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వ్యక్తం చేసే స్వభావంగల షేక్‌ మౌలా సాహెబ్‌ ఆ తరువాత

266