పుట:1857 ముస్లింలు.pdf/225

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఘనీభవించిన క్రౌర్యం

ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామం చివరి దశలో అవధ్‌ రాజధాని లక్నో పట్టుబడ్డాక ఆంగ్లేయ సైనికులు, శిక్కు సైనికులు కలసి సాగించిన కిరాతకాలకు అడ్డూఆదుపూ లేకుండా పోయింది. నిలువెల్లా రాక్షసత్వం పుణికి పుచ్చుకున్న సైనికులు లక్నోలో జరిపిన పలు కిరాతక చర్య లలో ఒక సంఘ టన గురించి మెజెనీది (Majendie) అను ఆంగ్ల సైనికాధికారి ఈ విధంగా వివరించాడు:

తమ దాళాధిపతి చనిపోయాడన్న కోపంతో సిక్కులు, కొంతమంది ఆంగ్లేయులు

కలసి, తమ కోపాన్నంతా ఒక్క మనిషి మీద చూపారు. అతనిని రెండు కాళ్ళతో పైకి

లేపి, రెండుగా చీల్చడానికి ప్రయత్నించారు. చేతకాక, నేల మీద ఈడ్చుకొని వెల్తూ అతని ముఖాన్ని కత్తులతో పొడిచారు. మీద పడుతున్నదెబ్బలకు ఓర్వలేని అతని దేహం వంకలు తిరిగింది. విచ్చుకతులతో గుంటలు పడుతున్న అతని నోరు పెడబొబ్బలు పెట్టింది. ఆ దేహంల్లోంచి ప్రాణాలు పోకమునుపే చితిని పేర్చి, దాని మీద అతనిని కూర్చుండ బెట్టి నొక్కి పెట్టారు. మంటల బాధతో పిచ్చెత్తిపోయిన ఆ నికృష్టుడు మండే దేహంతో పరిగెత్తిపోడానికి ప్రయత్నించి కొన్ని అడుగులు వేశాడు. చుట్టు ఉన్నయమ కింకరులు అతనిని మళ్ళీ లాక్ళెళ్ళి మంటలపై వేసి నుసి అయిందాక కాపాలా ఉన్నారు. ( Lucknow 1857, Roshan Taqui, New Royal Book Co, Lucknow, 2001, P. 266)

ఈ విధగా ఆంగ్ల సెనికుల చేతుల్లో బందీలైన బాధితులు బౌతికంగా వంకర్లు తిరిగిపోయిన సంఘటనలను ఉదహరిస్తూ, మెజెనీది ఉటంకించిన సంఘటలను పలు మార్లు రూఢిచేస్తూ Christopher Hibbert కూడా చాలా సంఘటనలను పూసగుచ్చి మరీ వివరించాడు. ఆంగ్ల సైనికులు పెట్టిన భయంకర చిత్రహంసల మూలంగా తరచు గా బాధితులు ఎనిమిది అంకెగా వంకర్లు తిరిగిపోయేవారని ఆయన పేర్కొన్నాడు.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి తమ పాలనకు హిందూ జనసముదాయాల మద్దతు సాధించేందుకు కుట్ర పూరితంగా వ్యవహరించిన ఆంగ్లేయ పాలకులు ముస్లింల పాలన కంటే తాము మెరుగైన మంచి పాలన ప్రజలకు అందించడానికి ఇండియాను పరిపాలిస్తున్నామని గొప్పలు చెప్పుకొచ్చిన ఆంగ్లేయులు ఎంత క్రూరంగా వ్యవహరించాలో, నిజానికి వారి ఆర్భాటపు

222