పుట:1857 ముస్లింలు.pdf/222

ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్లేయుల రాక్షసత్వం

అమానుషంగా వ్యవహరించారని ఆంగ్లేయ చరిత్రకారులే పేర్కొన్నారు. ఉరిశిక్షకు గురైన వ్యక్తుల ప్రాణాలు త్వరితంగా పోకుండా, గొంతుకు ఉరి గట్టి గా బిగుసుకోవడం త్వరితగతిన జరగకుండా ఉండేందుకు తలారిలను ఆంగ్ల సన్యాలుబతిమిలాడటమే కాకుండా వారికి లంచాలు ఇచ్చి మరీ తమకు ఆనందం కల్గించేరీతిలో తిరుగుబాటు యోధులను ఉరితీయించారు. ప్రాణం వెంటనే పోకుండా బాధతో విలవిలలాడి పోతూ ఉరికంబానికి ఎక్కువ సమయం వేలాడే విధంగా సరికొత్త పద్ధతులు కనిపెట్టమని తలారులను సైనికులు, సైనికాధికారులు ప్రోత్సహించారని, ఆ విధంగా సాగిన ఉరిశిక్షల పరంపరను చూసి ఆంగ్ల సైనికులు, అధికారులు, ఆంగ్లవనితలు ఎంతో

ఆంగ్ల సైన్యాలు గ్రామాలు తగులపెడుతుంటే తరలివెళుతున్న ప్రజలు

సంతోషించారని, ఆ దృశ్యాలను చూసేందుకు ఆంగ్లేయుల కుటుంబాలు పిక్నిక్‌కు వెడలినట్టుగా తరలి వచ్చాయని Christopher Hibbert తాను రాసిన The Great Mutiny సవివరంగా పేర్కొన్నాడు.

అలహాబాద్‌లో అలాంటి దారుణకాండను స్వయంగా చూసిన భోలానాథ్‌ చంద్ర అను స్వదేశీయుడు, దాదాపు ఆరు వేల మందిని ఈ రీతిన శీఘ్రంగా హతమార్చారు. వారి శవాలు పట్టణమంతా చెట్లకూ, స్తంభాలకూ రెండేసి మూడేసి చొప్పున వేలాడుతూ కనిపించాయి...రెండు నెలలపాటు రోజూ రెండు బండ్లు ఉదాయం నుంచి సూర్యాస్తమయం

219