పుట:1857 ముస్లింలు.pdf/215

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

(Our antagonism to the followers of Muhammed is far stronger than between us and the worshippers of Shiva and Vishnu. They are unquestionably more dangerous to our rule...If we could eradicate the traditions and destroy the temples of Muhammad by one vigor’s efforts it would be well for the Christian faith and for the British. - Rise of Muslims in Indian Politics, Rafiq Zakaria’s, Somaiya Publications, Bombay, 1986, P.6)

ఈ ప్రభావంతో అప్పట్లో ఢిల్లీ నగరంలోని చరిత్ర ప్రసిద్ధి చెందిన జుమా మస్జిద్‌, ఆగ్రాలోని ప్రపంచ ఏడు వింతలలో ఒకటైన తాజ్‌ మహల్‌ను కూలగొట్టాలని అతగాడు ప్రతిపాదించాడు. తాజ్‌ మహాల్‌ ను పూర్తిగా విద్వంసం చేస్తే అందులో లభించు చలువ రాళ్ళను విక్రయించాలని, తద్వారా ఆర్థికంగా కూడా చాలా ఆర్జించవచ్చని పదకం వేశాడు. ఈ చర్య వలన తమకు లాభం సంప్రాప్తించటం మాత్రమే కాకుండా ఈ చర్యల వలన ముస్లింల స్థితిగతులు ఎంత దిగజారిపోయి ఉన్నాయో వారికి నిరంతరం గుర్తు చేయవచ్చని విలియం రస్సెల్‌ లాంటి అధికారులు ఆలోచనలు చేసి ఆ దిశగా విఫల ప్రయత్నాలు చేశారు. (Rise of Muslims in Indian Politics, Rafiq Zakaria : P.7)

ఆనాడు విలియం రస్సెలు మనస్సులో మెదిలిన ఆలోచనలే ఇరత ఆంగ్లేయ అధికారులలో కూడ కలిగాయి. రస్సెల్‌ తాజ్‌మహల్‌, జుమా మస్దిద్‌ లాంటి ప్రముఖ చారిత్రక కట్టాడాల మీద దృష్టి సారించగా హ్యూస్ చెసిస్టర్‌ (Hugh Chishester)లాంటి సైనికాధికారులు ముస్లింల ప్రార్ధనాలయాలన్నింటిని విద్వంసం చేసి పూర్తిగా రూపుమాపాలని అనునుకున్నారు. ఢిల్లీలోని ప్రముఖ మసీదులతోపాటు చిన్నా చితకా ఇతర మసీదులన్నింటిని కూడ ద్వంసం చేయాలని సంకల్పించారు. హ్యూస్ చెసిస్టర్‌ తన కుటుంబీకులకు ఒక లేఖ రాస్తూ గత మూడు రోజుల నుండి ఈ విలన్లను కాల్చి చంపటం తప్ప మాకు వేరే పనిలేదు. నిన్నటి రోజున మూడు నుండి నాలుగు వందల మందిని కాల్చేశాము. నగరంలో చాలా అందమైన మసీదులు ఉన్నాయని, ఆ మసీదులన్నింటిని మొత్తంగా కూల్చివేయడం చూడాలని ఉంది నాకు అని చెప్పుకున్నాడు.

(‘ There has been nothing but shooting these villains for past three days Some 300 or 400 were shot yesterday...There are several mosques in the city most beautiful to look at. But I should like to see them all destroyed.’ - The Great Mutiny, Christopher Hibbert, Penguin 212