పుట:1857 ముస్లింలు.pdf/214

ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్లేయుల రాక్షసత్వం


సంగ్రామ చరిత్ర, ప్రచురణ కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమరయాధుల సంఘం, విజయవాడ, 1984, పేజి. 26)

తాజ్‌మహల్‌ కూలగొట్టాలన్నదుష్టాలోచన

అనూహ్యంగా సాగిన స్వదేశీ యోధుల పోరాటం, ఆంగ్లేయుల పట్ల స్థానికులు వ్యక్తం చేసిన ఆగ్రహం ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల అభిజాత్యానికి పెద్ద సవాలు విసిరింది. ఆంగ్లేయులలో ప్రతికార జ్వాలను మరింతగా మండించింది. ఆ కారణంగా భారతీయుల మీద సాగిన ప్రతీకారచర్యలలో భాగంగా ముస్లింల ఆర్థిక-ఆధ్యాత్మిక వ్యవస్థలను నాశనం చేయటమే కాకుండా ముస్లిం ప్రభువులు నిర్మించిన కట్టడడాలను

మరణించిన వారి నుండి కూడా అందినంత దోచుకుంటున్న ఆంగ్లేయాధికారులు

కూడ విధ్వంసం చేయాలన్ననిర్ణయానికి వచ్చారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉన్నతాధికారి విలియం రస్సెల్‌ తిరుగుబాటులో పాల్గొన్నముస్లింల గురించి వ్యాఖ్యానిస్తూ విష్ణువును-శివుడ్ని ఆరాధించే హిందువుల కంటే ముస్లింలంటే తనకు బద్ధ శత్రుత్వమని పేర్కొన్నాడు. ముస్లింలు తమ పరిపాలనకు ఎంతో ప్రమాదకారులని ప్రకటించాడు. అంతటితో ఆగని ఆ ఆధికారి ముస్లింల ఆచార వ్యవహారాలకు విఘాతం కల్గించి ప్రార్థనాలయాలను నేలమట్టం చేసినట్టయితే అది అటు క్రైస్తవ విశ్వాసానికి, ఇటు బ్రిటిషర్లకు చాలా మంచిదని కూడ సలహా ఇచ్చాడు.

211