పుట:1857 ముస్లింలు.pdf/196

ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం -7

ఆంగ్లేయుల రాక్షసత్వం

1857 సెపంబరు 14న ఢల్లీ నగరం ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామ యోధుల చేతుల్లోంచి జారిపోయింది. ఆ తరువాత ఆంగ్లేయులు పూర్తిగా డిల్లీని ఆక్రమించుకున్నాక నగరంలో ఆంగ్ల సైనికులకు ఎదురు లేకుండా పోయింది. చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ను నిర్బంధించి, రాజకుటుంబీకులను 30 మందిని అంత:పురం నుండి ఢిల్లీ గేటు వద్దకు లాక్కొచ్చి అందరి తలలను నిర్దాక్షిణ్యంగా నరికివేసి మొగల్‌ వారసుల ఖండిత శిరస్సులను బహదూర్‌ షా జఫర్‌కు బహుమతిగా పంపడంతో స్వదేశీయుల మీద ఆంగ్లేయ సైనికుల, సైన్యాధికారుల అంతులేని హత్యాకాండ ఆరంభమైంది.

చక్రవర్తికి ఇచ్చిన మాట తప్పిన ఆంగ్లేయ సెనికాధికారులు షాజహాన్‌ సమాధుల వద్ద ఆశ్రయం పొందిన మొగల్‌ రాకుమారులను కుట్రపూరితంగా స్వజనుల చేత మభ్యపెట్టించి బయటకు రప్పించి, రహదారిలో బహిరంగంగా కాల్చి చంపటంతో నగరవాసులు భీతాహులయ్యారు.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆంగ్ల సైనికులు కాశ్మీరి గేటు గుండా నగరంలోకి జొరబడ్డారు. నగరవాసుల నుండి ఎటువంటి ప్రతిఘటన లేకపోవడం,

193