పుట:1857 ముస్లింలు.pdf/190

ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ-ముస్లింల ఐక్యత


రాజరికపు రోజుల్లో ఆ విధంగా వ్యవహరించటం బేగం హజరత్‌ మహల్‌ బుద్ధికుశలతకు నిదర్శనం. అవధ్‌ నవాబు బిర్జిస్‌ ఖధిర్‌ పేరిట ప్రకటనలు వెలువడ్డాయి. ఆంగ్లేయుల పాలన అంతమైందని ఆ ప్రకటనలు స్పష్టం చేశాయి. ఆమె పాలనను అంతం చేయాలని ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు ఎంతగా ప్రయత్నించినా సుమారు 10 మాసాలపాటు వీలు కుదరలేదు . ఆమె పాలనకు హిందూ-ముస్లిం ప్రజానీకం తోడ్పాటు లభించింది.

1857 నవంబరు 1న బ్రిటిష్‌ మహారాణి స్వదేశీపాలకులు, తిరుగుబాటు యోధులు, ప్రజల నుద్దేశించి ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనకు ప్రతిగా తన కుమారుడు బిర్జిస్‌ ఖదిర్‌ పేరిట బేగం హజరత్‌ మహల్‌ మరోక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో హిందూ-ముస్లిం ప్రజానీం మనోభావాలకు సమాన ప్రాధాన్యత నిస్తూ పలు విషయాలను ఆమె ప్రస్తావించారు.

ఆ ప్రకటనలో, ' హిందూ-ముస్లింను హెచ్చరిస్తున్నాం. ఆత్మగౌరవంతో, ధర్మబద్ధంగా ప్రశాంత జీవితం సాగించాలంటే స్వదేశీపాలన కోసం శతృవులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టండి. స్వదేశీ సైన్యంలో భర్తీకండి..మాతృదేశం కోసం సాగుతున్న పోరాటంలో భాగస్వాములు కండి. శతృవుకు సహకరించకండి. ఆశ్రయం ఇవ్వకండి..', అని బేగం హజరత్‌ మహల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. (భారత స్వాతంత్య్రోద్యమం ముస్లిం మహిళలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌)

బేగం హజరత్‌ మహల్‌ ఎంతో దూరదృష్టితో పరాయి పాలకులను ఎదుర్కొనేం దుకు హిందూ-ముస్లింల ఐక్యతావశ్యకతను అంచనా వేసి తగిన సానుకూల చర్యలు తీసుకున్నందున హిందూ ముస్లిం మతములకు స్వాతంత్య్ర సముపార్జనకు సంబంధించిన ఈ సమరంలో తమ సర్వస్వము త్యాగము చేద్దామని మాన్‌సింగ్ వంటి హైందవ ప్రముఖులు, మౌల్వీ అహ్మద్‌షా వంటి ముస్లిం ప్రముఖులు నిశ్చయించుకున్నారు. వేలాది పండితులు, మౌల్వీలు రహస్యముగాను, బాహాటముగాను పవిత్ర యుద్ధ ప్రచారము చేసుకుంటూ ఔథ్‌ (అవధ్‌) అంతా పర్యటించనారంభించారు. సైనికులు ప్రమాణాలు చేశారు. పోలీసులు ప్రమాణాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఆంగ్లేయుల పాలనను అంతమొం దించే ఈ వ్యూహములో చేరారు. ప్రజాందోళనాగ్ని నలుదిశల వ్యాపించింది. (1857 స్వరాజ్య సంగ్రామం, వి.డి. సావర్కార్‌, నవయుగభారతి ప్రచురణలు, హైదారాబాద్‌,

187