పుట:1857 ముస్లింలు.pdf/187

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఐక్యతతో తిప్పిగొట్టాయి.

ముస్లిం వ్యతిరేక దుష్ప్రచారంతో పబ్బం గడవదన్న వాస్తవాన్ని తెలుసుకున్న ఆంగ్లేయులు ప్రజల దేశభక్తిని డబ్బుతో కొనేందుకు సిద్ధపడ్డారు. ఆ డబ్బు సంచుల ద్వారా రోహిల్‌ఖండ్‌లోని హిందూ సోదరుల దేశభక్తిని, ఆత్మగౌరవాన్ని కొనదలిచారు. ఆ పనికోసం తమ ఖజాన నుండి భారీగా డబ్బు సంచులను రోహిల్‌ఖండ్‌కు దిగుమతి చేసుకున్నారు. రోహిల్‌ ఖండ్‌లోని కొందరు విద్రోహులను చేరదీశారు. తమ పన్నాగాన్ని వివరించారు. డబ్బును ఎరగా చూపారు.

ఈ ప్రయత్నాలకు ఆంగ్లేయాధికారి జేంస్ బెట్రామ్ (James Outram) సారధ్యం వహించి, తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఆంగ్లేయుల ఖజనా నుండి దిగుమతైన అపార ధనరాశులను, ఆర్థిక సౌకర్యాలను ఆశ చూపించి ఆకట్టుకుని, ప్రజలను మతం పేరిట చీల్చాలని, ముస్లింల పట్ల హిందూ జనసముదాయాలలో అయిష్టతను పెంపొందించి అనెక్య త స్పషించేందుకు జేంస్ బెట్రామ్ పకడ్బందీగా పదక రచన చేశాడు.

బలమైన స్వాతంత్య్ర కాంక్షతో పోరుబాటను ఎంచుకున్న ప్రజలు, ప్రధానంగా హిందూ సోదరులు, జేంస్ బెట్రాం దుష్ట ప్రయత్నాలను గ్రహంచారు. ఆ పాపిష్టి సొమ్ము మా స్నేహం, ఐక్యతల ముందు, మా లక్ష్యం ముందు దిగదుడుపు అన్నారు. అయాచితంగా తమ ఇంటి గడపల వద్దకు తరలి వస్తున్న డబ్బు సంచులను పూర్తిగా తిరస్కరించారు. ఈ డబ్బుకు కక్కుర్తిపడి తమ మధ్య నున్న ఐక్యతను బలిచేసేది లేదన్నారు. తమ సంకల్పం నుండి ఎటువంటిపరిస్థితులలో తొలిగేది లేదని స్పష్టంగా ప్రకటించారు. ఆంగ్లేయుల, ఆంగ్లేయులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న విద్రోహుల ఎత్తులను పూర్తిగా తిప్పిగొట్టారు. ఫలితంగా ఆంగ్లేయాధికారుల ప్రయయ్నాలన్నీహిందూ-ముస్లిం జసముదాయాలు ఐక్యంగా వ్యక్తం చేసిన దృడాభిప్రాయం ముందు ఘోరంగా విఫలమయ్యాయి.

ఈ తిరస్కరణ వలన ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఖజానా నుండి దిగుమతి చేసిన సొమ్ము ఏమాత్రం ఉపయోగపడలేదు. దిగుమతి చేసుకున్న డబ్బుసంచులన్నీ అలాగే మిగిలిపోయాయి. గత్యంతరం లేని పరిస్థితులలో ఆ సంచులన్నిటిని తిరిగి ఖజానాకు పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయానిfl T. R Metcalf తన The Aftermath of Revolt (page 299) గ్రంథాంలో ‘ Sir James Outram (1803-63) failed to raise Hindus in Rohilkhand against the regime of Khan Bahadur Khan and had to re

184