పుట:1857 ముస్లింలు.pdf/180

ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ-ముస్లింల ఐక్యత


ఐక్యతకు అత్యంత ప్రాధాన్యత

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో హిందూ-ముస్లింల ఐక్యతను మరింతగా పండించేందుకు కృషిచేసిన వారిలో కాన్పూరు రాజ్యాధినేత నానా సాహెబ్‌, ఆయన ప్రధాన సహచరులు అజీముల్లా ఖాన్‌ల కృషి చెప్పుకోదాగ్గది. కాన్పూరులో 1857 జూన్‌ 7న నానా సాహెబ్‌ ఆంగేయులకు వ్యతిరేకంగా సమరశంఖారావాన్ని పూరించారు. ఆయన తన రాజ్యంలోని హిందూ-ముస్లింలకు ఎటువింటితేడా లేకుండ, ధార్మాన్ని- దేశాన్ని రక్షించేందుకు ఆయుధాలు చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆనాడు నానా సాహెబ్‌ పక్షాన బేగం అజీజున్‌ అను యోధురాలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో పాల్గొన్నారు. ఆమె పోరాటాలలో పాల్గొనటమే కాకుండా హిందూ -ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలచారు. ఆమె మతాలకు అతీతంగా ప్రజలలో వ్యకమౌతున్నఐక్యతను మరింత పరిపుష్టం చేసేందుకు కృషి సల్పారు. ఆమె స్వయంగా ప్రజలలో తిరుగుతూ మతాలకు అతీతంగా స్వదేశాన్ని పరదేశీయుల పెత్తనం నుండి పరిరక్షించుకోడానికి ప్రజలు ప్రదానంగా యువకులు తరలిరావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతున్నయోధులకు ఆహారపానీయాలు, ఆయుధాలు, మందులు అందించడానికి ముందుకు రావాల్సింగా ప్రజలకు విజ్ఞప్తి చేయడమే కాదు తాను స్వయంగా వీధి వీధి తిరిగి వాటిని సేకరించి అందరికి ఆదర్శంగా నిలిచారు. బొందిలో ప్రాణమున్నంత వరకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నిలచిన ఆమెను ఆంగేయాధికారి కాల్చివేతకు ఆదేశాలు ఇచ్చిన సమయంలో కూడ ' నానా సాహెబ్‌ జిందాబాద్‌ ' అంటూ నినదిస్తూ అమె ప్రాణాలు వదిలారు.

ప్రజలలో దేశభక్తి భావనలను పెంపొందించేందుకు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టేందుకు అజీముల్లా ఖాన్‌ స్వయంగా ' పయామే ఆజాది ' అను పత్రికను హిందీ, ఉర్దూ భాషల్లో వెలువరించారు. ఆ పత్రికలో '..భారతీయ హిందాువులారా, ముస్లింలారా లేవండి. సోదరులారా లేవండి. దైవం మనిషికి ఎన్నో వనరులను ఇచ్చాడు. అందులో విలువైనది స్వాతంత్య్రం..' అంటూ మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ ప్రజలకు ఇచ్చిన పిలుపును ప్రముఖంగా ప్రచురించి హిందూ ముస్లింలు కలసి పోరాడినప్పుడు మాత్రమే స్వాతంత్య్రం సిద్ధించగలదన్న భావనకు బలమిచ్చారు.

177