పుట:1857 ముస్లింలు.pdf/167

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

చేసేందుకు జహాంగీర్‌ ఖాన్‌ను ఎంతగా వేదించినా, ఆ సంఘటనకు తానొక్కడే కారణమని, మరెవ్వరి ప్రమేయం దీనిలో లేదని ఆయన చాలా స్పష్టంగా ప్రకటిం చాడు. చివరకు బ్రిటిషు సైనికాధికారుల చేతుల్లో పలు రకాలుగా చిత్రహింసలకు గురైన జహాంగీర్‌ ఖాన్‌ 1859 జూన్‌ మాసంలో చివరిశ్వాస వదిలారు.

ఈ విధంగా హైదారాబాదు రెసిడెన్సీ మీద జరిగిన దాడి విఫలమైన తరువాత కూడ నిజాం సంస్థానం లోని పలు ప్రాంతాలలో తిరుగుబాటు కార్యకలాపాలు కొనసాగాయి. ఈ మేరకు మౌల్వీ సయ్యద్‌ అహ్మద్‌ తిరుగుబాటుకు ప్రజలను ప్రేరేపిస్తూ ప్రచార కార్యక్రమాలను చాలా రహాస్యంగా నిర్వహించారు. గూఢచారుల ద్వారా ఆ విషయం తెలుసుకున్న బ్రిటిష్‌ అధికారులు మౌల్వీని నిర్భంధించేందుకు చేసిన ప్రయత్నంలో సైనికులు ఆయన మీద సాగించిన కాల్పులలో మౌల్వీ అహ్మద్‌ 1859లో తుపాకి గుండ్లకు బలయ్యారు.తెలంగాణ ప్రాంతంలోని నారాయణ్‌ఖేడ్‌కు చెందిన కుర్దుమియా సాహెబ్‌, నిర్మల్‌కు చెందిన తిరుగుబాటు నేత రాంజీగౌడ్‌ పక్షాన బ్రిటిషు వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. రాంజీ మనుషులతో కలసి నిర్మల్‌ వద్ద ఈస్ట్‌ ఇండియా కంపెనీ బలగాలతో పోరాడుతూ కుర్దుమియా 1860 ఏఫ్రిల్‌ 9న అమరులయ్యారు.

ఆంగ్లేయుల పట్ల అంతులేని వ్యతిరేకత

ఈస్ట్‌ ఇండియా కంపెనీ నిజాంకు అందిస్తున్న అభినందనల-ప్రశంసాపత్రాల పరంపరలో భాగంగా 1861లో స్టార్‌ ఆఫ్‌ ఇండియా అను మరొక బిరుదునిచ్చింది. బ్రిటిషు రాణి పక్షాన ఈ బిరుదును ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నిజాంకు బ్రిటిషు రెసిడెంటు డేవిడ్‌సన్‌ అందించాడు. ఆ సమయంలో కూడ ప్రజలు తమ అయిష్టతను చాలా స్పష్టంగా వెల్లడించారు. ఈ ఆగ్రహం ఎంతదూరం వెళ్లిందంటే ఆగ్రహాన్ని- అయిష్టతను కలగలిపి రాసిన ప్రకటనలు నగరంలోని బహిరంగ స్థలాలలో వెలిశాయి. పర్షియన్‌ భాషలో రాసిన ఈ ప్రకటనలు సాలార్‌ జంగ్, ఆయన ప్రధాన మంత్రి షంషుల్‌ ఉమ్రా నమాజ్‌ కోసం నిత్యం వెళ్ళేదారిలో మాత్రమే కాకుండా వారిరువురు వెళ్ళే మసీదులో కూడ వేలాడదీశారు.

ఆ ప్రకటనల సారాంశం ఈ విధంగా ఉంది.

బ్రిటిషు ప్రభుత్వం ఇచ్చిన బిరుదును స్వీకరించవలసిందిగా దివాన్‌ సలహా ఇస్తాడు. కొన్నాళ్ళ తరువాత అరబ్బులను, పఠానులను, రొహిల్లాలను వెళ్ళగొట్టమని

164