పుట:1857 ముస్లింలు.pdf/162

ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

కొవ్వు ఉంటుందన్న విషయం ప్రచారం చేసిబ్రిటిషర్లకు వ్యతిరేకంగా సైనికులను రెచ్చగొట్టారు. ఫలితంగా కంపెనీ సైన్యాధికారులు ఆయనను కూడ అరెస్టు చేసి, ఆయన కార్యకలాపాలను రాజద్రోహ చర్య లుగా ప్రకటించి, పది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆ తరు వాత మౌల్వీసయ్యద్‌ అజీజ్‌ హుస్సేన్‌ను కూడా తిరునల్వేలి లైలులో నిర్బంధించారు.

గుంటూరు గోదావరి సీమలలో తిరుగుబాటు

నిజాం సంస్థానంలో వ్యక్తమైన తిరుగుబాటు రాయలసీమను మాత్రమేకాకుండా గుంటూరు, గోదావరి సీమలను కూడ ప్రభావితం చేసింది. 1857 జూలై మాసంలో

1857లో మౌల్వీ అల్లావుద్దీన్‌, పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ల నాయకత్వంలో దాడికి గురైన 1805 నాటి బైటిష్‌ రెసిడెన్సీ చిత్రం

మచిలీపట్నంలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరంలోని సిపాయీలు పెరేడ్‌ జరుపు మైదానం ఎదురుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆకుపచ్చని పతాకాన్ని ఎగురవేశారు. ఆంగ్లేయులను నరికి వేయండి అంటూ హిందూస్థానిలో నినాదాలు రాసిన ప్లకార్డు కూడ ఆ జెండా కర్రకు కట్టి ఉంది. ఈ దాశ్యం ఆంగ్లేయాధికారులలో కలవరానికి కారణమైంది. ఆఘమేఘాల మీద కదలిన ఆంగ్లేయాధికారులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. సైనిక మైదానంలో తిరుగుబాటు గుర్తులు ప్రతిష్టించిన నిందితులను పట్టుకున్న వారికి రూ.500 లు బహుమానాన్ని ప్రకటించినా, అధికారులు ఎంత ప్రయ త్నించినా ఆదృశ్యాన్ని రూపొందించిన సాహసుల ఆచూకిని ఏ మాత్రం కనిపెట్ట

159