పుట:1857 ముస్లింలు.pdf/156

ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రప్రదేశ్ ముస్లింలు


చేతబట్టి వీరావేశంలో ఊగిపోతున్న జనంతో నిండిపోయింది. ఎటు చూసినా ఆగ్రహా వేశాపరులైన ప్రజలు కన్పిస్తున్నారు. ఆ సమయంలో రెసిడెన్సీ మీద దాడికి విచ్చేసిన ప్రజాసమూహం మహా క్రౌర్యాన్ని ప్రదర్శించే మానవ ముఖాల మహాసముద్రంలా ఉందని స్థానిక బ్రిీటిష్‌ రసి యఫ్‌.డేవిడ్‌సన్‌ భారత ప్రభుత్వ కార్యదర్శికి రాసిన లేఖలోపేర్కొన్నాడు. (an ocian of human faces, exhibiting ferocity in its wrost forms' The Freedom Struggle In Hyderabad, Volume II (1857--1885) Govt. of AP, 1956, Pp. 38-39)

రోహిల్లా యోధుడు తుర్రేబాజ్‌ ఖాన్‌ తన సహచరయోధులతో కలసి రెసిడెన్సీ చేరు కోగానే దానికి ఎదురుగా ఉన్న స్థానిక వ్యాపార ప్రముఖులు, తిరుగుబాటు యోధు ల మద్ధతుదారులైన అబ్బాస్‌ సాహెబ్‌ (అబ్బన్‌ సాహెబ్‌), జెగోపాల్‌ దాస్‌ పిత్తి భవంతులను స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ భవంతుల పై అంతస్థుల మీద నుండి ప్రస్తుత సుల్తాన్‌బజార్‌ వైపు గా రెసిడన్సీ మీదా దాడి జరిపారు. అబ్బాస్‌ సాహెబ్‌, జెగోపాల్‌ దాస్‌ పిత్తి భవంతుల మీద నుండి మోహరింపు జరిగినందున పుత్లీబౌలీ, దిల్‌షుక్‌ నగర్‌ తోటల వైపున ఉన రెసిడెన్సీ గేట్ల మీద దాడి చేసేందుకు తిరుగుబాటు యోధులకు బాగా అనువయ్యింది.

153