పుట:1857 ముస్లింలు.pdf/155

ఈ పుట ఆమోదించబడ్డది

1857:ముస్లింలు


మీద విషయాన్ని బ్రిటిషు రెసిడంటుకు తెలుపుతూ తగిన జాగ్రత్త చర్య లు తీసుకోమన్నాడు.స్వయంగా నిజాం కూడ రంగంలోకి దిగి అవాంఛనీయ సంఘటల నివారణకు కట్టుదిట్టవున చర్యలు చేపట్టాడు. మక్కా మసీదు వద్ద గుమికూడిన ప్రజలను చెదరగొట్టెందుకు అరబ్‌ రక్షక దళాలను పంపించాడు. రెసిడన్సీ రక్షణకు ప్రత్యేక దళాలను పంపుతున్నానని రెసిడెంటుకు కబురు చేస్తూ, రక్షణ దళాలు రెసిడెన్సీ వద్దాకు చేరుకునేంతవరకు తగుజాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రెసిడెంటును కోరాడు.

బ్రిటీష్ రెసిడెన్సీపై సాహసోపేత దాడి

1857జూలై 17 సాయంత్రానికల్లా రెసిడెన్సీ మీద దాడికి అన్ని విధాలుగా తిరుగుబాటు యోధులు సన్నద్ధమయ్యారు. ఈ దాడికి ప్రముఖ రోహిల్లా నాయకుడుతుర్రేబాజ్‌ ఖాన్‌, మౌల్వీ అల్లావుద్దీన్‌లు సంయుక్తంగా నాయకత్వం వహించారు. ఈఇరువురి నేతృత్వంలో 500 మంది రొహిల్లా వీరులు, పెద్దా సంఖ్యలో ప్రజలు రెసిడెన్సీమీదా దాడికి సిద్ధామయ్యారు. (The Freedom Struggle In Hyderabad, Volume II, P.51)

మక్కా మసీదు నుండి బయలు దేరిన యోధాుల దాళానికి మౌల్వీ ఇబ్రాహీం తిరుగుబాటు పతాకంతో ముందు నడిచి ప్రజలలో ప్రేరణ కల్గించారు. ఈ విధాంగాదాడికి బయలుదేరిన రోహిల్లా యోధులకు, దారిలో కుల, మతాలతో సంబంధ లేకుండ హిందూ-ముస్లిం ప్రజానీకం పెద్ద సంఖ్యలో తోడుగా వచ్చింది. ఆగ్రహంతో ముందుకుసాగుతున్న యోధులతో పాటుగా ప్రజా సమూహాలు ముందుకు సాగాయి. బ్రిటీష్ రెసిడన్సీవెపుకు దారితీసే అన్ని మార్గాలలో ప్రజలు గుంపులుగుంపులుగా రెసిడన్సీ వైపుకు కదిలారు.

ప్రస్తుతం హైదారాబాదు నగరంలోని కోఠి సెంటరులో ఉన్న మహిళా కళాశాల ఆనాడు బ్రిటీష్ రెసిడెన్సీ. ఆ రెసిడెన్సీలో బ్రిటీష్ ఉన్నతాధికారి కార్యాలయం, నివాసంఉండేది. ఆ రెసిడెన్సీలో పోరాట యోధుడు చిద్దాఖాన్‌ ఆయన అనుచరులను బంధించిఉన్నందున, మక్కా మసీదు నుండి రెసిడెన్సీ మీద దాడికి బయలుదేరిన యోధాులు,ప్రజలు సాయంత్రం ఐదున్నర గంటలకు ఆ ప్రాంతం చేరుకున్నారు.

ఆ ప్రాంతం పడమర వైపున ప్రస్తుత ఉస్మానియా వెద్య కళాశాల రోడ్డు ఆబిడ్స్‌కు వెళ్ళు రోడ్డు పూర్తిగా దాడికి సిద్ధమైన తిరుగుబాటు యోధులు, చేతికి అందిన ఆయుధాన్ని

152