పుట:1857 ముస్లింలు.pdf/151

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

తిరుగుబాటు జ్వాలలు రగిలాయి. ఆ సైన్యం మీద ఆధిపత్యం చలాయిస్తున్న ఆంగ్లేయ ఉన్నతాధికారుల మీద స్వదేశీ సైన్యాధికారులు, సైనికులు బాహాటంగా తిరగబడి కలకలం సృషించారు. కంపెనీ అధికారుల ఆజ్ఞలను ఉల్లంఘించారు. ఔరంగాబాదాులో గల నిజాంసైన్యంలోని కాల్బలం నిజాం రాజ్యం సరిహద్ధు దాటి వెళ్లేందుకు నిరాకరిస్తూ నిజాంకే సరహద్‌ బాహర్‌ నహీ జాయేంగే-దీన్‌ కే ఊపర్‌ కమర్‌ నహీ బాందేగ (నిజాం సంస్థానం సరిహద్దులు దాటి వెళ్ళం-స్వమతసు లకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యం) అని ప్రకటించి సంచలనం సృష్టించింది. (' We will not cross the frontiers of the Nizam's dominions and we will not fight against our own co-religionists ' - Highlights of the Freedom Movement in Andhra Pradesh, Dr. Sarojini Regani, 1972, Page.8).

ఆనాడు ఉత్తర భారతదేశంలో పలు పరాజయాలను ఎదుర్కొంటున్న ఆంగ్లేయులు ఆ ప్రాంతాలలోని స్వదేశీ పాలకుల మీద పోరాటానికి తమను అక్కడకు తరలిస్తారని స్వదేశీ సైనికాధికారులు భావించారు. 1780 ప్రాంతంలో ఏవిధంగానైతే హైదార్‌ అలీ మీద యుద్ధం చేయడానికి సైనికుల తరలింపు కార్యక్రమాన్నిస్వదేశీ సైనికులు అడ్డగించారో అదేవిధంగా 1857 ప్రాంతంలో కూడ ఉత్తరాదికి వెళ్ళడానికినిరాకరిస్తూ అధికారుల ఆజ్ఞలను స్వదేశీ సైనికులు నిరసించారు. ఆ నిరసన నుండి ఉద్బవించిన ధిక్కారానికి జమేదార్‌ అమీర్‌ ఖాన్‌, దాపేదార్‌ మీర్‌ ఫిదా అలీలు నాయకత్వం వహించారు. ఆ సంఘటనను పురస్కరించుకుని ఆజ్ఞల ఉల్లంఘనకు పాల్పడిన ఫిదా అలీపై సైనికవిచారణ జరిపి ఆయనను ఉరి తీశారు. అమీర్‌ఖాన్‌ మాత్రం పట్టుబడకుండా తప్పించుకున్నారు.

అధికారుల ఆజ్ఞలను తు.చ తప్పక పాించే స్వదేశీ సైనికులు, సెన్యాధికారులు తిరుగుబాటును ప్రకటించడం, ఆంగ్లేయాధికారులతో సరాసరి తలపడానికి సిద్ధపడడాటాన్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు ఏమాత్రం సహించలేకపోయారు. తిరుగుబాటు ప్రభావం ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా తిరుగుబాటుకు ఉద్యుక్తులైన వారి మీద కఠిన చర్యలు తీసుకున్నారు.

148