పుట:1857 ముస్లింలు.pdf/143

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ప్రాంతం తెలంగాణాగా పిలువబడింది. 1857 నాటికి ఆంధ్రప్రాంతం మద్రాసు ప్రెసిడన్సీలో భాగంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఏలుబడిలో ఉండగా, తెలంగాణా ప్రాంతంనిజాం నవాబు పాలన క్రింద ఉంది.

ఈ మార్పులు, నిజాం రాజకీయ నిర్ణయాల మూలంగా నైజాం సంస్థానంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల పెత్తనం హద్ధులు మీరింది. ఈ పెత్తనాన్ని సహంచలేని స్వదేశీయులు నిశ్శబ్దంగా వ్యక్తం చేస్తూ వచ్చి ఆత్మాభిమానంగల యోధులు చివరకు నిరసనకు రూపం ఇచ్చారు. ఆ విధగా స్వజనుల మీద బ్రిటిషర్ల పెతనాన్ని సహంచలేక, ఆంగ్లేయాధికారుల చర్యలను వ్యతిరేకించిన తొలినాటి ప్రముఖులలో నూరుల్‌ ఉమ్రా బహదూర్‌ ఒకరు . నిజాం దర్బార్‌లో ముఖ్యుడైన ఆయన బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా వ్యవహరించమని స్వదేశీ సైనికులను 1806 ప్రాంతంలో ప్రోత్సహించారు. ఆ కారణంగా నిజాం నవాబు ఆగ్రహానికి గురై దర్బారు నుండి బహిష్కరించబడి, ఉస్మానాబాద్‌ జిల్లాలోని ఔసా కోటలో జీవితకాల నిర్బంధానికి గురయ్యారు. నిజాం సంస్థానంలో ఆంగేయ వ్యతిరేక బీజాలను నాటిన నూరుల్‌ ఉమ్రా చివరకు 1818లో కన్నుమూశారు.

ఉత్తర భారత దేశంలో ఆరంభమై వహాబీల ఉద్యమ ప్రబావంతో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ, నిజాం సంస్థానాలలో తిరుగుబాటు పతాకాలు ఎగిరాయి. నూరుల్‌ ఉమ్రా తరువాత మరో నిజాం వంశ ప్రముఖుడు మీర్‌ గోహర్‌అలీ ఖాన్‌ బ్రిటిష్‌ వ్యతిరేక పోరాట వేదిక మీదకు వచ్చారు. ఆయన నిజాం నవాబ్‌ సికిందర్‌ ఝూ బహదూర్‌ కుమారుడు, అప్పటి హైదారాబాదు నవాబు నసిరుద్దౌలా సోదరుడు. ఆయన అసలు పేరు మీర్‌ గోహర్‌ అలీ ఖాన్‌ అయినప్పిటికీ ఆయన ముబారిజుద్దౌలాగా ప్రఖ్యాతుడు. బ్రిటిషర్ల అడుగులకు మడుగులొత్తే నవాబుల నైజానికి ముబారిజుద్దౌలా బద్ధ వ్యతిరేకి.

నూరుల్‌ ఉమ్రా పోరాట వారసత్వాన్ని చేపట్టీన స్వేచ్ఛా-స్వతంత్ర భావాలు గల ముబారిజుద్దౌలా ఆంగేయుల పెత్తనాన్ని నిరసస్తూ 1815లో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత 1830లో అరబ్బు, ఆఫ్గన్‌ జాతీయులతో కలిసి తిరగబడ్డారు. ఆయన తిరుగుబాటు నిజాం, బ్రిటిషర్ల సంయుక్త బలగాల ముందు ఊపిరి పీల్చుకోలేక పోయింది; చివరకు ఆయన నిర్బంధానికి గురయ్యారు. ఆ తరు వాత 1839లో మరోమారు ముబారిజుద్దౌలా పోరుకు సిద్ధపడగా, బ్రిటిష్‌ రాణికి, నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా

140