పుట:1857 ముస్లింలు.pdf/140

ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర పదశ్‌ ముస్లింలు

చిత్తగించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ విశాఖపట్నం సైనిక స్థావరాన్ని సుబేదార్‌ అహ్మద్‌ ఆయన సహచరులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ తిరుగుబాటు చర్య లలో స్థానిక ప్రజలు కూడా భాగస్వాములయ్యారు.

కంపెనీ సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నసుబేదార్‌ అహ్మద్‌ తన సహచరులను హైదారాబాదు దిశగా నడిపించేందుకు ముందుకు సాగుతుండగా స్థానిక జమీందారు నారాయణ గణపతి దేవ్‌ విశాఖపట్నం సైనిక స్థావరం అధికారి కాసామేజర్‌ను (Casamajor) స్వదేశీ సిపాయీల చెరనుండి విముక్తం చేయమని అహ్మద్‌కు సలహా ఇచ్చాడు. ఆ సలహా వెనుకనున్న ఆంతర్యం గ్రహించని తిరుగుబాటు యోధులు ఆంగ్లేయాధికారిని విడుదల చేశారు. ఆ అధికారి సత్వరమే తగు చర్యలు తీసుకుని, కకావికలమై ఉన్న తన సైనిక బలగాలను తిరిగి సమకూర్చుకున్నాడు. తిరగబడిన సెనిక యోధు లకు స్వదేశీ జమీందారుల సహకారం ఏమాత్రం లభించకుండా జాగ్రతలు తీసుకున్నాడు. కంపెనీ సైన్యాలను సమీకరించుకున్నాక సుబేదార్‌ అహ్మద్‌ను, ఆయన అనుచరులను వెంటాడమని తన సైనిక బలగాలను పంపాడు. ఆ వేటలో చివరకు సుబేదార్‌ అహ్మద్‌ సహచరులను గుడ్డెరాల్లి వంక (Gudderally wanka) వద్ద అక్టోబరు 8 రాత్రిపూట ఆంగ్లేయాధికారులు అరెస్టు చేశారు. ( ' The Sepoy Revolt of Vizagapatnam,1780' , B. Kesavanarayana, Andhra Pradesh History Congress, Proceedings of Warangal Sessions, 1990, P. 184)

ఆ సమయంలో తప్పించుకున్నసుబేదార్‌ అహ్మద్‌ కొన్నిమాసాలు కంపెనీ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి చివరకు పట్టుబడ్డారు. ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన తొలినాటి సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సుబేదార్‌ అహ్మద్‌ మీద విచారణ జరిపి ఉరిశిక్ష విధించారు. విశాఖపట్నంలోని ప్రస్తు త అబుసరంగ్ స్ట్రీట్ లో సుబేదార్‌ అహమ్మద్‌కు ఆనాబు ఉరిశిక్ష అమలు చేశారు.

ఈ సంఘటన గురించి విశాఖపట్నం సైనికస్థావరం అధికారి కాసామేజర్‌ మద్రాసు గవర్నర్‌కు లేఖ రాస్తూ వైజాగ్ పట్నం సిపాయిల తిరుగుబాటును తీవ్రమైన, ప్రమాదకరమై న సంఘ టనగా అభివర్ణించాడు. సంస్థానాధీశుడు నారాయణదేవ్‌ సహాయం సహకారాలు లభించి ఉండకపోతే ఈ సంఘటనలో ఆంగ్లేయులు ఎవ్వరూ బతికి ఉండే

137