పుట:1857 ముస్లింలు.pdf/138

ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం - 5


మౌల్వీ అల్లావుద్దీన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి పూర్వమే భరతగడ్డ మీద వీచినబ్రిటిష్‌ వ్యతిరేక పవనాలకు తెలుగుబిడ్డలు కూడ తగు విధగా ప్రతిస్పందించారు. ఆ స్పందనల మేరకు ఆంధ్ర ప్రదశ్‌లోని పలు ప్రాంతాలలో తగిన చర్య లకు పూనుకున్నారు. ఆ పోరాట స్పూర్తితో ప్రథమ స్వాతంత్య్రపోరాటంలో కూడ తమదైన భాగస్వామ్యాన్ని అందించారు.

ఆంగ్లేయుల మీద సిపాయీల తొలి తిరుగుబాటు 1857లో జరిగినట్టు చెబుతున్నప్పటికీ అప్పటికి సుమారు 77 ఏళ్ళ క్రితమే అనగా 1780లోనే విశాఖపట్నంలోతెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి సిపాయీల తిరుగుబాటు కు తగినంత స్థానం, ప్రచారం లభించలేదు.

ఆ కారణంగా విశాఖపట్నం సిపాయీల తిరుగుబాటు చరిత్ర పుటలలో మరుగున పడిపోయింది. 1857 నాటి స్థాయిలో విశాఖపట్నం యోధు ల తిరుగుబాటు జరగనప్పటికి సిపాయీల తొలి సమర శంఖారావం మోగింది తెలుగు గడ్డ మీద కాగా ఆ సమరానికి నాయకత్వం వహించింది తెలుగు బిడ్డలు కనుక ఆ చారిత్రాత్మక సంఘటను గురించి

135