పుట:1857 ముస్లింలు.pdf/132

ఈ పుట ఆమోదించబడ్డది

కలం యోధులు


ఆంగ్లేయల మీద కలబడిన పోరాటయోధుడిగా, కలంతో ఇటు స్వదేశీయులను చైతన్యవంతుల్ని చేసిన ప్రముఖ కవిగా తన ప్రత్యేకత నిలుపుకున్న ప్రముఖ స్వాతంత్య్రసమర యోధుడు. అలహాబాద్‌లో ప్రజలు ఆయన నాయకత్వంలో ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసి చరిత్ర సృష్టించారు.ఆనాడు మౌల్వీ లియాఖత్‌ రాసిన ఈగీతం ప్రతి సందర్భంలోనూ అలహాబాద్‌ ప్రజలు, పోరాట యోధులు పాడుకోవటం ఆనవాయితిగా మారటంలో ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామ గీతంగా అది ప్రజల హృదయాలలో నిలచి పోయింది. (Muslims Poets in Independence Struggle, Faisal Hashmi, Radiance Views Weekly, 31August - 6 September 2003, P. 51).

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అలహాబాద్‌ జిల్లా చాయిల్‌ తహసిల్‌లోని ఓ గ్రామంలోని చేనేత కార్మికుల కుటుంబంలో జన్మించిన మౌల్వీ లియాఖత్‌ అలీ (మౌల్వీ లియాఖత్‌హుసైన్‌) భారతీయ సైనికులను పరాయి పాలకులకు వ్యతిరేకంగా కూడగట్టేందుకుబ్రిటిష్‌ సైన్యంలో చేరారు. భారతీయసైనికుల మనస్సుల్లో ఆంగ్లేయ వ్యతిరేకతను నూరిపోయటం ప్రారంభించారు. మౌల్వీ ప్రయ త్నాలను పసికట్టిన అధికారులు ఆయనను సైన్యం నుండి బహిష్కరించారు. ఆ తరువాత మౌల్వీ లియాఖత్‌ అలీస్వగ్రామాన్ని చేరుకుని మహాగావ్‌లను ప్రధాన కేంద్రంగా చేసుకునిబ్రిటిష్‌ వ్యతిరేక ప్రచారాన్ని పున: ప్రారంభించారు. ప్రజల న్యాయమైన హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ధర్మ పోరాటం సాగించాలని ఉద్భోధించారు. (Freedom Fighters of Indian Mutiny 1857, M.P Srivastava, Ghugh Publications, Allahabad, 1997, Pp. 160-61)

ఆ ఉద్భోద మరింత శక్తివంతంగా ప్రజలకు చేరడానికి, ప్రజలలో మాతృభూమి పట్ల ప్రేమాభిమానాలు మరింత పెరగడానికి, ఆంగ్లేయుల పట్ల వ్యతిరేకత మరికాస్త బలపడడానికి ఆనాడు మౌల్వీ లియాఖత్‌ అలీ ఉర్దూ బాషలో రాసిన కవిత ఇలా సాగింది.


' హమ్‌ హౖౌె ఇస్‌కే మాలిక్‌ హిందూస్ధాన్‌ హమారా ! పాక్‌ వతన్‌ హై భౌమ్‌కా జన్నత్‌సేభి ప్యారా యే హై హమారీ మిల్కియత్‌, 129