పుట:1857 ముస్లింలు.pdf/130

ఈ పుట ఆమోదించబడ్డది

కలం యోధులు


అందుబాటులో ఉన్న ఢల్లీ ఉర్దూ అఖ్బా పత్రికలను కాల్చివేశారు. పత్రికా కార్యాలయంలోవిధ్వంసాన్నిసృష్టించారు. మౌల్వీ బాఖర్‌ కుటుంబానికి చెందిన ఆస్తిపాస్తులను దోచుకున్నారు. చివరకు బాఖర్‌ కుటుంబానికి నిలువ నీడ కూడ లేకుండా చేశారు.

ఈ విధంగా మాతృభూమి విముక్తి కోసం పరాయి పాలకుల మీద సాగిన సాయుధా పోరాటంలో కలాన్ని ఆయుధంగా చేతపూని అక్షరాగ్నులతో శతృసంహారం చేస్తూ ప్రాణాలు వదలిన ప్రప్రథమ పత్రికాధిపతిగా, ప్రతికా సంపాదాకుడిగా మౌలానా మొహ్మద్‌ బాఖర్‌ భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలోనే కాదు భారత పత్రికారంగ చరిత్రలో కూడ తనదైన ముద్రతో చిరస్మరణీయ ఖ్యాతిని గడించారు.

( '..It is to pointed out that the first martyr of the Indian media to the cause of Independence was Moulvi Mohammed Baqar, Editor, Delhi Urdu Akhbar ' - Media and Muslims in India Since Independence, Ed. AU Asif,IOS, New Delhi,1998, P 6)

1857 నాటి పోరాట కాలంలో ప్రజలలో దేశభక్తి భావనలను పెంపొందిం చడంలో, హిందూ-ముస్లిం-శిక్కు జనసమూహాల మధ్య ఐక్యతను ప్రోదిచేయడంలో, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టేందుకు, సాయుధ పోరాట యోధులను ఉత్సాహపర్చేందుకు 'పయామే ఆజాది' పత్రిక కూడ తనదైన పాత్ర వహించింది. ఈ పత్రికను ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ యోధులు, కాన్పూరు అధినేత నానాసాహెబ్‌కు ప్రధాన అనుచరుడిగా ఖ్యాతిగాంచిన అజీముల్లా ఖాన్‌ వెలువరించారు. ఈ పత్రికను తన స్వీయ సంపాదకత్వలో హిందీ, ఉర్దూ భాషల్లో ఆయన ప్రచురించారు. పయామే ఆజాది మరాఠీî భాషలో కూడా నడిపేందుకు ప్రయత్నాలు జరిగాయి.

ఆనాడు అజీముల్లాను సంప్రదించనిదే నానా సాహెబ్‌ ముఖ్యమైన నిర్ణయమేది తీసుకునేవారు కాదు. (1857 సfiరాజ్య సంగ్రామం, వి.డి సావర్కర్‌, పేజీ 23). నానా సాహెబ్‌ ప్రతినిధిగా అజీముల్లా ఖాన్‌ తిరుగుబాటుకు చక్కని వ్యూహరచన చేశారు. నానా ప్రధాన సహచరుడిగా తిరగబడిన స్వదేశీపాలకులను కూడగట్టేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇతర ప్రాంతాల సైనిక నేతలకు, ప్రత్యేకించి బ్రిటిష్‌ సైన్యంలోని భారతీయ సైనికులకు ఆయన ఉత్తరాలు రాశాడు. ఈ లేఖలలో అజీముల్లా

127