పుట:1857 ముస్లింలు.pdf/125

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

యే-నూర్‌' (Riazi-i-Noor) కూడ ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించే వార్తలను-సమాచారాన్ని ప్రచురించింది. ఆంగ్లేయాధికారులు ప్రజలను పీడిస్తూ ఇబ్బందుల పాల్జేస్తున్న సంఘటనలను యధాతథంగా ప్రచురిస్తూ అధికారుల ఆగ్రహానికి పలుమార్లు గురయ్యింది. ప్రజల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్న ఒక తహశీల్దార్‌ (Tehsildar) స్థాయి ప్రభుత్వాధికారి గుట్టును రట్టుచేస్తూ వ్యాసం ప్రచురించగా, దానిని సాకుగా చూపి, మున్షీ హుసైన్‌ ఖాన్‌ రాతలను అడ్దుకునేందుకు 1856లో ఆయనను అరెస్టు చేసి విద్రోహం ముద్ర వేసి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది.

ప్రజల పక్షం వహిస్తున్న పత్రికల మీద ఆంగ్లేయాధికారులు కిరాతంకంగా వ్యవహరిస్తున్నా స్వతంత్ర స్వభావాలు గల పత్రికలు మరిమ్మి రంగలోకి రాసాగాయి. 1854లో ఢిల్లీ కేంద్రంగా 'సాదిఖుల్‌ అఖ్బార్‌' (Sadiqul Akhbar) పత్రిక సయ్యద్‌ జమీలుద్దీన్‌ సంపాకత్వంలో ఆరంభమైంది. ఈ పత్రిక ఆది నుండి ప్రజలలో బ్రిటిష్‌ వ్యతిరేక బీజాలు నాటడంలో ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగి విజయం సాధించింది. ఆంగ్లేయులను ఈ గడ్డ నుండి వెళ్ళ గొట్టటమే తన లక్ష్యంగా ఎంచుకున్న సాదిఖుల్‌ అఖ్బార్‌ తన లక్ష్యసాధనకు అనుకూలమైన వార్తలకు ప్రాధాన్యతనిచ్చింది.

బ్రిటిషర్లను పాలద్రోలి మొగల్‌ పాదుషాను తిరిగి నెమలి సింహాసనం మీద కూర్చోబెట్టేందుకు గాను ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌ నుండి సైన్యాలు కదలి వస్తున్నాయని, ఆంగ్లేయులకు ఈ గడ్డ మీద ఇక నూకలు చెల్లాయని, తెల్లవాళ్ళకు ఇక సమాధి కట్టడం ఖాయమంటూ ప్రజల్ని ఉత్తేజితుల్ని చేయగల వార్తలను సాదిఖుల్‌ అఖ్బార్‌ ప్రచురించింది. ఈ విధంగా ప్రజలను తిరుగుబాటుకు ప్రేరేపించే విధంగా సమాచారం ప్రచురిస్తున్నందున సాధిఖుల్‌ అఖ్బార్‌ యాజమాన్యం, సంపాదకుల మీద ఆగ్రహించిన ప్రభుత్వం సంపాదకులు జమీలుద్దీన్‌ను అరెస్టు చేసి విచారణ జరిపి మూడేండ్ల జైలు శిక్షను విధించింది. ( They Too Fought for India's Freedom (The Role of Minorities) : P. 121).

1857 నాి ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలను సన్నద్దులను చేయగల సాహిత్య-సమాచారాన్ని అందాచేసి తిరుగుబాటుకు అనువగు మానసిక వాతావరణాన్ని పత్రికలు నిర్మించాయి. ఈ రకంగా బ్రిటిష్‌ వ్యతిరేక పోరులో ఢల్లీ ఉర్దూ అఖ్బార్‌ సంపాదకులు మౌల్వీ ముహమ్మద్‌ బాఖర్‌ ప్రధాన పాత్ర నిర్వహించారు. ప్రధమ

122