పుట:1857 ముస్లింలు.pdf/124

ఈ పుట ఆమోదించబడ్డది

కలం యోధులు


వ్యతిరేకించింది. ఉర్దూ జర్నలిజం మీద ఉక్కుపాదం మోపేందుకు ఆంగ్లేయాధికారులుచేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు తెలిపింది; తెస్తున్న చట్టాలను వ్యతిరేకించింది. ఈచట్టాలు రూపొందుతున్న విషయాన్ని విమర్శనాత్మకంగా ప్రజల దృష్టికి తెచ్చింది. ఈదిశగా రూపొందుతున్న చట్టాల మూలంగా ఉత్పన్నమమ్యే పరిస్థితు లను ప్రజలకు, పత్రికాధిపతులకు తెలియచేసింది.

ఆంగ్లేయాధికారుల చర్య ల పట్ల ఇటు ప్రజలలోనూ అటు పత్రికాధిపతు లలోనూ వ్యతిరేకతను కోహినూర్‌ ప్రోదిచేసింది. పత్రికల నోరునొక్కేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్య లను అడ్డుకోవాలనీ లేనట్టయితే ప్రతి ఒక్కరూ నష్టపోతారనీ తెలిపింది. ప్రభుత్వ చర్యలు సఫలమైనట్టయితే పత్రికా స్వేచ్ఛ హరించబడుతుందని, ఇక నుండి పత్రికలు ప్రచురించటం వృధా కాగలదని 1856 ఏప్రిల్‌ 29నాటి సంచికలో ప్రభుత్వ వ్యతిరేక సంపాదకీయం, వార్తల ద్వారా పాత్రికేయులను, ప్రజలను హెచ్చరించింది.

('Freedom Struggle and Urdu Journalism During the Nineteenth Century' Mrs. Abida Sameeuddin, ' They Too Fought for India's Freedom-The Role of Minorities' , Ed. Asghar Ali Engineer, Hope India, Gurgaon, 2006, P. 120).

ఆంగ్లేయులకు మాత్రమే వ్యతిరేకం కాకుండా ఆనాడు అవథ్‌ సంస్థానాధీశుడు నవాబు వాజిద్‌ అలీ ఖాన్‌ కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుతెన్నులను కూడ 'కోహినూర్‌' దుదాుయ్యపట్టింది. నవాబు అలీషా ఎంత సానుకూలంగా ఉన్నా కూడా కంపెనీ పాలకులు నవాబును అక్రమంగా తొలగించి అవథను, అవథ్‌ రాజధాని లక్నోను స్వాధీనం చేసుకున్న తరుణంలో ఆనాటి పరిస్థితులను వివరిస్తూ ప్రజలు ఎదాుర్కొంటున్న ఇక్కట్లను,బ్రిటిష్‌ అధికారుల దుష్ట చర్యలను నిర్భయంగా బహిర్గతం చేసింది. ఆ కారణంగా ఆగ్రహించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు కోహినూర్‌ సంపాదకులు మున్షీ హర్‌సుఖ్‌ను 1856 మార్చిలో అరెస్టు చేసి ఏడు సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంచారు. (' They Too Fought for India's Freedom-The Role of Minorities', Op. cit., P. 121).

ముల్తాన్‌ నుండి మున్షీ ముహమ్మద్‌ మెహది హుసైన్‌ ఖాన్‌ (Munshi Mohammad Mehdi Hussain Khan) సంపాదకత్వంలో వెలువడిన 'రియాజ్‌-

121