పుట:1857 ముస్లింలు.pdf/120

ఈ పుట ఆమోదించబడ్డది

కలం యోధులు


వహించి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తమ రచనల ద్వారా తిరుగుబాటుకు ప్రోత్సహించారు. ఈ తరహాలో ప్రభుత్వానికీ, ప్రభుత్వాధికారుల చర్యలకూ వ్యతిరేకంగా సమాచారాన్ని, వార్తలను ప్రచురించిన పలు ఉర్దూ పత్రికలు ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామంలో తమదైన పాత్రను నిర్వహించాయి. ఈ పత్రికలలో ప్రముఖంగా పేర్కొదగినవి 1836 లో ప్రారంభమైన 'ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌' (Delhi Urdu Akhbar, Delhi), 1850లో ప్రారంభించబడిన 'కోహినూర్‌' (Kohi-i-Noor, Lahonre), 1852లో స్థాపించబడిన 'రియాజ్‌-యే-నూర్‌' (Riazi-i-Noor, Multan),1854 నుండి ప్రచురితవున 'సాదిఖుల్‌ అఖ్బార్‌' (Sadiqul Akhbar, Delhi), లక్నో నుండి వెలువడిన 'తిల్సిం-యే-లక్నో' (Tilism-i-Lucknow), ద్వీపాంతరవాస శిక్షలను విధించి, లక్నో కేంద్రాంగా 1856 నుండి వెలువడుతున్న 'సహర్‌-యే-సమ్రి', (Sahar-i-Samri) ఉన్నాయి.

ఈ ప్రతికలతో పాటుగా బహదూర్ర్‌ షా జఫర్‌ పర్యవేక్షణలో ఆయన స్వంత దినపత్రిక సిరాజుల్‌ అఖ్బార్‌ (Sirajul Akhbar) కూడ ఆనాడు ప్రదాన పాత్ర వహించింది. ఈ పత్రిక అంత:పురవాసులతో పాటుగా జఫర్‌ వ్యక్తిగత సిబ్బంది, రాజ సైనికులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆనాడు తిరుగుబాటును ప్రోత్సహిస్తున్న ఇతర పత్రికలు ప్రధానంగా సిరాజుల్‌ అఖ్బార్‌ నుండి అధికారిక సమాచారాన్ని సమకూర్చు కునేవి. ఈ విధంగా సిరాజుల్‌ అఖ్బార్‌ అటు పండితులను ఇటు ప్రజలను, ఇతర పత్రికలను బాగా ఆకట్టుకుంది. ఈ దినపత్రిక ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ సమయంలో కూడ యథాతదంగా వెలువడింది. (Bahudur Shah II and The War of 1857 in Delhi with Its unforgettable Scenes, Mahdi Husain, M N Publishers and Distributors, New Delhi, 1987)

ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌, సాదిఖుల్‌ అఖ్బార్‌ పత్రికల్లాగే సిరాజుల్‌ అఖ్బార్‌ కూడ అటు ప్రజలకు సంబంధించిన ఇటు ప్రబువుల సమాచారాన్ని ప్రచురించింది. బహదూర్‌ షా జఫర్‌ వద్దకు మీరట్ నుండి తిరుగుబాటు యోధులు రావటం దగ్గర నుండి పోరాటం ముగింపుకు వచ్చేంత వరకు జరిగిన సమాచారాన్ని గుదిగుచ్చి సాదిఖుల్‌ అఖ్బార్‌ వెలువరించింది. ఆంగ్లేయుల పరాజయం, స్వాతంత్య్ర సమరయోధుల విజయాలను ఘనంగా ప్రచురించి ప్రజలలో ప్రేరణకు కారణమయ్యింది. (Bahudur Shah II : Mahdi Husain)

117