పుట:1857 ముస్లింలు.pdf/117

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

1857 పోరాటంలో పాల్గొన్న ఆంగ్లేయాధికారి జనరల్‌ థామాస్‌ వ్యాఖ్యానిస్తూ They are the real heros of 1857 అని ప్రశంసించడన్నిబట్టి మౌల్వీల బహుముఖ పాత్ర స్పష్టమౌతుంది.

1857లో మాత్రమే కాదు ఆ తరువాత కూడ జాతీయోద్యామంలో మౌల్వీలు సాహసోపేత పాత్రను నిర్వహించారు. పరాయిపాలకులను పాలద్రోలడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న మౌల్వీలు ఆ లక్ష్యసాధన కోసం తమ సర్వస్వాన్నీమాతృభూమి సేవలో సమర్పించారు; ప్రవాస జీవితాన్నీఅనుభవించారు. అండమాన్‌ జైలులో అసంఖ్యాకంగా అసువులుబాశారు. స్వాతంత్య్రోద్యామానికి మిత్ర దేశాల మద్దతు సంపా దించటం కోసం దాశాబ్దాల తరబడి రహస్యంగా పర్యిటిస్తూ తమ సంపూర్ణ జీవితాలను సమర్పించారు. మతం పేరుతో చీలికలు సృష్టించడం సరికాదంటూ చివరి వరకు భారత దేశ విభజనను చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధంగా బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలోని అన్నిదశలలోనూ తమదైన పాత్రవహించి భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో తమదైన అధ్యాయాన్ని సృష్టించుకున్నారు.

ఆనాడూ అటు తరువాతా అంతటి మహోన్నత పాత్రను నిర్వహించారు కాబట్టే Jamaith-e-Ulema-e-Hind ప్రధాన కార్యదర్శిగా మౌలానా సయ్యద్‌ అహ్మద్‌ మదని పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఢిల్లీలో జరిగిన సభలో స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిత జవహర్‌ లాల్‌ నెహ్రూ˙ మ్లాడుతూ, ఈ ఉలమాల పాదాధూళి నా కళ్ళకు సుర్మాలాంటిది. వారి పాదాలను ముద్దెట్టుకోవడం నేను గౌరవంగా భావిస్తా అని అన్నారు.

( '... the dust under the feet of these Ulema is like corrylium for my eyes and kissing their feet would be a matter of great pride for me. They Too Fought For India's Freedom (The Role of Minoritiers) , Ed. Ashghra Ali Engineer, Hope India,Gurgaon, 2006, P. 15)

ఈ వ్యాఖ్యలను బట్టి ఇస్లామియా పండితులైన మౌల్వీలు భారత స్వాతంత్య్ర సంగ్రామంలో నిర్వహించిన పాత్ర ఏమిటో, ఆ పాత్ర ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యత ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

114