పుట:1857 ముస్లింలు.pdf/112

ఈ పుట ఆమోదించబడ్డది

మౌల్వీలు

ఖాన్‌, రహీం, మజ్నూషా, ఖుతుబ్‌ షా, సర్వర్‌ షా, షేక్‌ అలీ, షేక్‌ ఫర్మూద్‌ అలీ, షేక్‌ మన్నూ, సిరాజుద్దీన్‌, సయ్యద్‌ అహ్మద్‌, వజీర్‌ తదితరులు ఉన్నారు. (The Heroes of Cellular Jail, S.N .Aggarwal, Rupa & Co, New Delhi, 2006, Pp. 306 - 317)

ఈ మౌల్వీలతోపాటుగా ఢిల్లీకి చెందిన ముఫ్తి మహజర్‌ కరీం, లక్నోకు చెందిన మున్షీ ఇనాయత్‌ అహమ్మద్‌లు కూడ అండమాన్‌ జీవితాన్ని గడిపిన తొలినాి యోధులలో ఉన్నారు.

ప్రముఖ మౌలానా యహ్యా అలీ థానేశ్వరి అండమాన్‌ దీవుల్లో చనిపోయినప్పుడు ఆయన అంత్య క్రి య లలో పాల్గొ నేందుకు శిక్షలు అనుభ వి స్తున్న మౌల్వీలను

స్వాతంత్య్ర సమరయోధులను కఠిన శిక్షలకు గురిచేసిన అండమాన్‌లోని సెల్యూలర్‌ జైలు

అనుమతించారు. ఆ సందర్భంగా ఆయన జనాజా నమాజ్‌లో సుమారు నాలుగు వేల మంది మౌల్వీలు పాల్గొన్నారని మౌలానా జాఫర్‌ అలీ థానేశ్వరి తన డైరీలో రాసుకున్నారు. ఈ సంఖ్యను బట్టి బ్రిటిషు ప్రభుత్వం ఆ రోజుల్లో మొత్తం మీద నాలుగు వేల మందిని నిర్భంధించి అండమాన్‌ దీవుల పంపినట్టుగా అర్థమౌతుంది. ఈ విధంగా పంపబడిన వారిలో అత్యధికు లు సన్నిహితులకు, బంధు వులకు, కుటుంబీకులకు దూరంగా ఒంటరిగా గడపి కన్నుమూశారు. ఈ విధంగా దాశాబ్దాల పాటు అండమాన్‌ కారాగారంలో మగ్గిపోయి చివరకు కాలధర్మం చేసిన మౌల్వీలు వందల సంఖ్యలో ఉన్నారు.

109