పుట:1857 ముస్లింలు.pdf/105

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ప్రకటించాల్సిన దుస్థితి తటస్థించింది. నూాటాయాభై సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని పట్టి బంధించి తెచ్చిన వారికి 50 వేల రూపాయల నజరానాను కంపెనీ ప్రకంచిందంటే, ఆ వ్యక్తి కంపెనీ పాలకుల మస్తిష్కాల్లోనూ, భౌతికంగా కంపెనీ సైనికల బలగాలల్లోనూ ఎంతటి భయోత్పాతాన్ని కల్గించాడో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ చర్యలతో ఏమాత్రం భీతినొందని మౌల్వీచివరి వరకు రాజీలేని పోరాటం సాగించారు. ఢిల్లీ కేంద్రంగా ఆరంభమైన తిరుగుబాటు సమసి పోవటం, స్వదేశీ పాలకుల పోరాటాలు నిర్వీర్యం అవుతున్నదశలో స్వదేశీ పాలకులను సమీకరించుకుని ఆంగ్ల సైన్యాలను మరింత బలంగా ఎదిరించాలని మౌల్వీ అహ్మదాుల్లా భావించారు. ఆయన పోవెన్‌ రాజు జగన్నాధ్‌ సింహ్‌తో సంప్రదింపులు జరపాలనుకున్నారు. ఆ ప్రయ త్నాలలో భాగంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వదేశీయులు సాగిస్తున్న పోరులో కలసిరావాల్సిందిగా జగన్నాధ్‌కు నచ్చ చెప్పేందుకు మౌల్వీ పోవెన్‌ వెళ్ళారు. ఆ సమయంలో జగన్నాద్‌ సింహ్‌ తమ్ముడొకడు మౌల్వీ మీద ఆకస్మికంగా కాల్పులు జరపటంతో ఆయన మృత్యువాతపడ్డారు.

ఈ విషయాన్ని విడి సావార్కర్‌ తన 1857 స్వరాజ్య సంగ్రామం లో ప్రస్తావిసూ, 'రాజా ప్రక్కనే ఉన్న అతడి సోదరుడు మౌల్వీ పై గురిచూసి కాల్పులు జరిపాడు. ఆ దుర్మార్గుని హస్తాలలో మౌల్వీ హతుడైపోయాడు. ఆ పిరికిపందలు..మౌల్వీశిరస్సు ఖండించి, దాని పై గుడ్డ కప్పుకొని చేరువనే 13 మైళ్ళ దూరాన ఉన్న బ్రిటిషు ఠాణా - షాజహాన్‌పూరుకు తీసుకువెళ్ళారు...రక్తం ఓడుతున్న ఆ పవిత్ర శిరాన్ని ఆ నీచులు ఆంగ్లేయుల ముందు కానుకగా ఉంచి వారి పాదాల చెంత మోకరిల్లారు...నీచమైన దేశద్రోహానికి తలపడిన ఆ పోవెన్‌ పశువుకు 50 వేల రూపాయల పారితోషికం లభించింది! అని రాశారు.

మౌల్వీ ఖండిత శిరస్సును తెప్పించుకుని చూసి అనందించిన అధికారులు, మౌల్వీ మరణాన్ని నిర్ధారించుకున్నతరువాత మాత్రమే 'ఉత్తర భారత దేశంలో బలిష్టమై న శత్రువును' తొలగించుకోగలిగామని చెస్పుకున్నారు. ( The most formidable ememy of the British in Northern India ( History of the Indian Mutiny : General Holmes, P. 539) ఈ విధంగా మాతృభూమిని చెరపట్టిన పరాయి పాలకుల మీద రాజీలేని పోరాటం సాగించిన మౌల్వీ అకుంఠిత దీక్షను, అద్వితీయ శక్తి సామర్థ్యాలను బ్రిటిష్‌ సైనికాధికారులు, చరిత్రకారులు తమ నివేదికలలో, గ్రంథాలలో స్వయంగా

102