పుట:1857 ముస్లింలు.pdf/102

ఈ పుట ఆమోదించబడ్డది

మౌల్వీలు

ఈ పరాజయంతో ఆంగ్లేయాధికారులు ఆగ్రహోదగ్రులయ్యారు. ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న కంపెనీ అధికారులు భారీ సంఖ్యలో వచ్చి మరోసారి దాడి జరిపారు. ఆత్మవిశ్వాసం, సాహసం, నాయకత్వం పట్ల అంతులేని విధేయ త తప్ప ఆయుధ శిక్షణగానీ, కనీస ఆయుధాలు గానీ లేని స్వదేశీ యోధులకు ఈసారి పరాజయం తప్పలేదు. చివరకు షామ్లి, థానా భవన్‌ ఆంగ్ల సెన్యాల పరమయ్యాయి. స్వదేశీయోధు ల నేతలకు యుద్ధరంగం నుండి తప్పించుకోవడం మినహా మరో మార్గం లేకుండ పోయింది. ఆ విధంగా తప్పించుకున్న మౌలానా నానాతవి, మౌలానా ఇమ్‌దాదుల్లా, మౌలానా రషీద్‌ అహ్మద్‌ గంగోహిల కొరకు ఆంగ్లేయులు వేట ఆరంభించారు. విప్లవకారులను పట్టిచ్చిన వారికి భారీ నజరానాలు ప్రకటించారు. ప్రజల అండదండలతో స్వదేశీ యోధులు ఆంగ్ల సైన్యాలకు చిక్కకుండాతప్పించుకున్నారు.

ఆలా తప్పించుకున్న నాయకులలో మౌలానా ఇమ్‌దాదాుల్లా కొన్ని రోజుల పాటు రహస్యంగా ఉంటూ ఆ తరువాత మక్కా వెళ్ళిపోయారు. మౌలానా నానాతవి మాత్రం మూడు రోజుల తరువాత అజ్ఞాతవాసం నుండి బయటకు వచ్చారు. ఆయన కోసం బ్రిటిష్‌ గూఢచారుల వేట ఇంకా కొనసాగుతున్నందున అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిందిగా మిత్రులు సలహా ఇచ్చారు. మూడు రోజుల కంటె ఎక్కువ కాలం అజ్ఞాతం లోకి (హిజ్రత్‌) వెళ్ళిపోవటం సున్నత్‌ యొక్క సాంప్రదాయం కాదు. ఎందుకంటే ప్రవక్త మక్కా నుండి మదీనాకు హిజ్రత్‌ చేసే సమయంలో స్ధర్‌ గుహలో మూడు రోజులు మాత్రమే దాగియున్నారు అంటూ మౌలానా బహిరంగంగా తిరగసాగారు. అయినా ఆయన పట్టుబడలేదు. (భారత స్వాతంత్య్ర సాధనలో ముస్లిం త్యాగాలు పేజి.19 )

పోరు సల్పమని ప్రజలకు ఫత్త్వా

ఈ విధంగా షామ్లి కేంద్రంగా సాగిన సాయుధ తిరుగుబాటు సమసిపోగా, ఫిరంగి మహాల్‌కు చెందిన మరో ధార్మికవేత్త మౌలానా ఫజలుల్‌ హఖ్‌ ఖైరతాబాది (Moulana Fazal Huq Khairatabadi) తాను స్వయంగా కత్తి పట్టకున్నా తనకు ప్రజలలో ఉన్న పలుకుబడితో ప్రజలను పరాయి పాలకుల మీద తిరగబడాల్సిందిగా కోరుతూ కలంతో యుద్ధం ఆరంభించారు. ఆయన మౌలానా రషీద్‌ అహ్మద్‌ గంగోహితో కలసి ఆంగ్లేయలతో పోరు సల్పమని ప్రజలను కోరుతూ ఫత్వా జారీ చేశారు. ఈస్ట్‌

99