పుట:1857 ముస్లింలు.pdf/10

ఈ పుట ఆమోదించబడ్డది

మండలి వేయడం; మండలి సభ్యుల మధ్య స్పష్టమైన శ్రమ విభజన ఉండటం లాంటి 'ప్రజాస్వామ్య' విధానాలు, నాటి సందర్భం దృష్ట్యా, నిజంగా కొత్త విషయమే! విక్టోరియా రాణి 'ప్రకటన'కు ప్రతిస్పందనగా బేగం హజ్రత్‌ మహల్‌ వెలువరించిన ప్రకటన, అందులో ఆమె చర్చించిన విషయాలు 'భారతీయ' భావనను బలపరుస్తూన్నాయి. పాలనా వ్యవహారాలకు సంబంధించిన వికేంద్రీకరణ సూత్రం 'ప్రజాస్వామ్య' సిద్ధాంతాన్ని తప్పక తలపింప జేస్తుంది.
1857 'అధికారిక' చరిత్రకారుడిగా పేరొందిన సురేంద్రనాధ్‌ సేన్‌ రచన జూరివీనీశిలిలిదీ ఓరిశిగి ఐలిఖీలిదీ లాగా నశీర్‌ పుస్తకం ఎన్నో వాస్తవాలను బహిర్గతపర్చుతూ వ్యక్తులు మరియు సంఘటనలను వివరిస్తుంది. ఎన్నో కొత్త విషయాలతోపాటు వైయుక్తిక 'తిరుగుబాటు' దారుని/దారురాలి వివరాలను పాఠకలోకానికి అందిస్తుంది. ఈ పోరాటంలో పాల్గొన్న నాయకులు, ప్రజలు 'భారతీయ' భావనతో బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన క్రమాన్ని రచయిత ఎంతో చక్కగా వివరించారు. దీనివల్ల వాస్తవికమైన, ఆచరణలో ఉన్న భారత ప్రజల సంఘజీవనం, హిందూ-ముస్లిం సహజీవన సంఘీభావాలు మనకీ రచనలలో ద్యోతకమౌతాయి. 'వారు' (బ్రిటీష్‌వారు) 'మనం' (భారతీయులం, హిందూ -ముస్లింలు కలసి) అనే స్పష్టమైన భావజాలంతో పోరాట నిర్మాణం, కొనసాగింపు జరిగాయన్న విషయం మనకు కొట్టోచ్చినట్లు కనబడుతుంది. మతపరమైన విభేదాలూ, విద్వేషమూ తర్వాతి కాలం నాటిదనేది స్పష్టపడుతుంది. మతపర బేధభావాలు లేని సమైక్య జీవన ఆలోచనావిధానానికి 1857 ఒక బలమైన ప్రతీక. 'హిందూ-ముస్లింలు ఈ విధంగా 'ఐక్యంగా' ప్రతిఘటించడం వల్లనే వలసపాలకులు తర్వాతి కాలంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి రెండు సమూహాలను రెండు పరస్పర విరుద్ధ సాంస్కృతిక సమూహాలుగా ప్రచారం చేసి విభజించారు; తమ కార్యక్రమంలో సఫలమయ్యారు కూడా ! ఈ 'పరస్పర విరుద్ధ' భావజాలాన్నీ తెలిసో తెలియకో పలువురు 'జాతీయవాదులు' కూడా అనుసరించి 'జాతీయోద్యమం'లోకి చొప్పించారు. గోవులను తినేవారూ, గోవులను పూజించేవారూ, పందులను తినేవారు, పందులను అసహ్యంచుకునేవారు ఏకమై తిరగబడ్డారనీ భావించబట్టే ఆంగ్లేయులు హిందూ-ముస్లింల మధ్య స్పర్థల్ని సృష్టించగలిగిన, వారి ఐక్యతను ఛిన్నాభిన్నం చేయగలిగిన ప్రతి అంశాన్నీ వదలకుండా ఎంతో జాగ్రత్తగా వాడుకున్నారు. ఆనాడు హిందూ-ముస్లింలు చూపించిన సంఘీభావ శక్తి అంత బలమైనదన్నమాట.
1857 పోరాటంలో ముస్లింలు గణనీయమైన పాత్రను పోషించారు. వాళ్ళ పాత్ర