ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

శ్రీ మాతండ్రిఁగారు నావిద్యా బుద్ధి కౌశలపరిశ్రమముల విషయమై శార్వరి సంవత్సరమున (1839 సంవత్సరము కొనను) నన్ను కలకత్తాకుఁబంపిరి. అక్కడ నేను కీలక సంవత్సరము తుది మాసముల వరకు (1849 సంవత్స రారంభమున కొద్ది మాసముల వరకు) నుంటిని. అపుడు నాయుపాధ్యాయులలో నొకరై యుండిన శ్రీ యుక్తబాబు రామచంద్ర మిత్రిగారి సత్సహవాసము వల్లను, మహనీయులైన శ్రీరాజా రామమోహన రాయల వారిచే వికృతి (1830) సంవత్సరమున స్థాపింపఁబడి, మహిర్షియని యెన్నిక కెక్కిన దేవేంద్రనాథ ఠాకురుఁ గారి చేత నుద్ధరింపఁ బడిన "ఏక మేవా ద్వితీయమ్" అనునట్టి బ్రహ్మసమాజములోని వారిచే శ్రుతి స్మృతులలో నుండి సంగ్రహింపఁ బడిన గ్రంథములను చదువుట వల్లను, నాకుఁ గలిగిన తత్త్వచింతయు, నేనుమరల విశాఖపట్టణము వచ్చిన పిమ్మటను నాకుటుంబము వారికి అనాదిగా మతగ్రంథోపదేశక సం