పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/78

ఈ పుటను అచ్చుదిద్దలేదు
10]

62

కాళిదాసు చరిత్ర

శ్లో॥ఘటో జన్మస్దానం, మృగపరిజనో, భూర్జవసనో
   వనేనాస, జందాదికమశన; మేనంవిధగుణ:
   అగస్త్య:పడోధొంయధకృతకరొభోజకుహరే,
   క్రియాసిద్ధి: సత్త్వేభవతి మహాతాం నోపకరణే

తా॥అగస్త్యుడు కుండలో జన్మించెను. అతనికి బరివారము మృగనమూహమే. కట్టుబట్ట భూర్జపత్రము, ఉనికి నట్టడవి, భోజనము కందమూలఫలములు-ఇట్లుండియు నతడు సముద్రమంతయు నఱచేతిలో బట్టి త్రాగివైచెను. మహాపురుషులయొక్క కార్యసిద్ధి వారి మహిమయందే యుండునుగాని సాధనసామగ్రియందుండదు.

     అదివిని రాజు సంతోషించి యతనికి గొప్పబహుమాన మొసంగి, ముగుబుట్టవలె నెఱసినతలతో మొగమునిండబసుపు బూసికొని పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొని వృద్ధబ్రాహ్మణునిప్రక్కనున్న పెద్దముత్తైదువయిన యతనిభార్యనుజూచి “అమ్మా ! మీరుగూడ నీసమస్యను బూరింపు“ డని భోజుడు పలుకెను. అప్పుడాయవ్వ యిట్లుపూరించెను.

శ్లో॥రధస్తైకం చక్రం , భుజగయమితా: సప్తతురగా,
   నిరాలం లోమార్గ, శ్చరణనికలు సారధి రపి,
   రవి ర్యాత్యేభ వాన్తం ప్రతిదిన మహరస్యనభస:
   క్రియాసిద్ధిస్సత్త్యేభవతి మహతాం,నొసకరణే

     తా॥సూర్యుని రధమునకు జక్ర మొక్కటి, ఏడుగుఱ్ఱములు, పాములతో వాటిని గట్టుదురు. ఆరధము పోవునట్టి యాకాశమార్గము నిరాధారమైనది. రధముదోలెడుసారధి కాళ్లులేనివాడు. అయినను సూర్యుడు ప్రతిదినము మేరలేని యాకాశముయొక్క కొట్టకొనవఱకు బోవుచున్నాడు. మహాపురుషులయొక్క కార్యసిద్ధి వారి మహిమయందే యుండునుగాని సాధనసామగ్రియందుండదు.