పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/75

ఈ పుటను అచ్చుదిద్దలేదు
66

కాళిదాస చరిత్ర

యామె ప్రత్త్యుత్తరమిచినతోడనే యత డామె పాండిత్యమునకు మిక్కిలి యానందించి , దీక్షితులుగారివద్ద విద్య నేర్చుకొన్న యాడుపిల్లయే యింత పాండిత్యము గలిగి, యింత పటుత్వముగా గవిత్వము చెప్పగలిగిన నింక దీక్షితులుగారి పాండిత్య మేట్లుండునో ? ఆయన ముందర మన మాగగలమా యని తనలొ వితర్కించుకొని "మీనాయనగారు వచ్చిన తరువాత మరల వచ్చెదనమ్మా" యని యామెతో జెప్పి యారాత్రియే ధారానగరము విడిచిపొయెను.

ఒ క వి ద్యా వ తి

ధారాపురమున నొక

బ్రాహ్మణుడు తనకూతురు

మంచి సాంప్రదాయముగల యొక పడుచువని కిచ్చి వివాహం చేసెన్. అల్లుదు బహుదేశ్డములు కరిగి విద్యలు నేర్చి కటకములొ జ్యొతిశ్శాస్త్ర మభ్యసించు చుండెను. బ్ర్రాహ్మణుని కూతురు రజస్వలయై నాలుగైదు సంవత్సరములయ్యెను. ఎంతకాలము కనిపెట్టుకొనియున్నను వారి యల్లుడు వచ్చుటగాని, భార్యను దీసికొనిపొవుటగాని సంభవిమదయ్యెను. ప్రానము విసికి యాబ్రాహ్మణు డూరకుండెను. ఎట్టకేలకు బ్రాహ్మణునిబాలిక పుట్టినింటయుండజాలక తాను శాస్త్రవిద్యాభ్యాసముజేసినపండితురాలగుటచే గటకముపొవునట్టి యొకానొకనిచేతి కీక్రిందిశ్లోకము వ్రాసియిచ్చి యది తన భర్త కిమ్మని పంపెను.

శ్లో॥గృహేహిత్వా బాలా మభినవ విలాసాన్వితతనూ,
     మధిషె భిక్షాసి చిర మధిశయాన క్షితితలే
     పరిజ్ఞాతే శాస్త్రే కటక మటతో జీర్యతి వపు
     చలోరే పాండిత్యం న విషయసుఖం వాపిచతమ

     తా॥నవయోవనముతొ గూడిన శరీరముగల బాలికను గృహమందు విడిచిపెట్టి మాధకరము జేసికొని నెలబండుకొని చిరకాలమునుండి విద్య నేర్చికొనుచున్నావు. ఆ కటకమునందు నీవు విద్యా సమాప్తి