పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/48

ఈ పుటను అచ్చుదిద్దలేదు

39

కాళిదాస చరిత్ర

    ఈకధ భరతమహాముని నాటకముగాజేసి స్వర్గలోకములో దేవేంద్రుని కొలువులో నాడించెను. భరతమహాముని మొట్టమొదట నాట్యశాస్త్రము, నభీనయశాస్త్రము, సంగీతశాస్త్రము రచియించిన మహానుభావుడు. ఆయన దే వ త ల ప్రీతికై యనేక నాటకములు రచియించెనని వాడుకకలదు. అందులో నీ జగన్మోహినీనాటక మొకటి. ఈ నాటకమును జూచుటకై దేవేంద్రుని కోరికెమీద బ్రహ్మవిష్ణు మహేశ్వరులు కుటుంబములతొ వచ్చిరి వసిష్ట విశ్వామిత్ర భరద్వాజ కాస్యసాంగీరస దుర్వాసప్రముఖు లైన మహర్షులు దయచేసిరి. సిద్ధసాధ్యవిద్యాధరకిన్నర కింపురుషాదులు సయితము ప్రేక్షకులైరి. రంభోర్వశి మేనకాదులైన యచ్చరమచ్చెకంబులును విచ్చేసిరి. ఆ నాటకములో జగన్మోహిని వేషమును 'పుంజికస్దల ' యను నప్సరసతాల్చెను. శంకరుని  వేషము పుంజిక స్దలకు మిక్కిలి ప్రియుడైన హంసుండను గంధర్వుడు  దాల్చెను. భరతమహాముని నాటకకర్తయంట! అచ్చరపదది స్త్రీ వేషము దల్చెనట! గంధర్వుడైన హంసుడు పురుషవేషముదాల్చునట. ఇంక రక్తి విషయమై చెప్పవలసినదేమున్నది? జగనోహినీరూపము దాల్చిన పుంజికస్దలయొక్క యభినయము, నాట్యము, గానవైఖరి, భావప్రకాశము, రూపలావణ్యవిశేషములు వర్ణనా తీతములైయుండెను., శంకవేషముదాల్చిన హంసుని యభినయముగూడ దాని కనుగుణముగానే యుండెను. కవి చాతుర్యము, నటకుల ప్రయోగ కౌశలము , ప్రేక్షకుల మహారసికత యను మూడు నొకచోట గూడియున్నప్పుడు చెప్పవలసినదే మున్నది? ప్రేక్షకులు నిశ్చేష్టులైరి. దేవతలు ఱెప్ప వాల్చక చూచుటచే వారికి నిలింపశబ్దము సార్దక మయ్యెను. రంభాదులైన యచ్చరలు పుంజికస్దల యొక్క నృత్యగానాబినయవిద్యలను జూచి సిగ్గుపడి తలవంచుకొనిరి. అది నాటకముగా దలంపక సభాసదులు, నిజముగా శంకరుడు జగన్మోహినిని దమ కన్నుల యెదుట వలచి