పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/32

ఈ పుటను అచ్చుదిద్దలేదు

23

కాళిదాస చరిత్ర

బ్రవేశించుటకై వచ్చును. అప్పుడు తలుపులు తీయుమని యడుగును అప్పుడు మీరు భయపడక కొండవలె నిశ్చయుడై 'నాకు విద్యా దానము ఛేసిన గుడి తలుపులు తీసెద, లేనిచొ దీయ ' నని కంథమెత్తి పలుకుడు. అంతట దెల్లవాఱుచున్నదను భయముచే దేవితత్తఱపడి గుడిలో బ్రవేశింపవలెనను కోరికతొ మీరు కోరిన వరములిచ్చి లోపలబ్రవేశించును. అప్పుడు మీరు విద్యవంతులగుదురు. ఆవిధముచే మీరు విద్యా వంతులు కావలెనుగాని ఇప్పుడక్షరములు నేర్చికొని పుస్తకముబట్టి పండితులగుట యసంభవము. విద్యావంతులైతిరా సమస్తవైభవములు గలుగును. విద్య వినయమొసగును. -భాగ్యమొసగును. ఇహపరసౌఖ్య మొసగును- గౌరవ మొసగును. వేయేల! విద్యకల్పవృక్షము. కాబట్టి నామనవిం జేకొని, పరమేశ్వరియైన కాళిం నాశ్రయింపుడు" అని భార్య హితొపదేశము జేయు భర్త మంచిదని నామెచెప్పిన చొప్పున జేయదలంచి పడటిల్లు విడచి పెరటిదారిన వీధిలొ బ్రవేశించి నాయర్ధరాత్రమున నిర్భయముగా నామె చెప్పిన యానవాళ్లనుబట్టి కాళికాలయమున కరిగి గుడిజొచ్చి తలుపులుమూసి గడియవైచుకొని లోపల గూర్చుండెను.

కాళికా ప్రత్యక్షము

కాళికయు యధేచ్చముగా

లోకసంచారముజేసి కడపటి జామున దన యాలయముకడకు వచ్చి తలుపులు మూయబడి యుండుటకు మిక్కిలి యక్కజమంది భయంకరముగా నిట్లనియె, "ఓరీ! యెవడురా! నయాలయము గవాటముబంధించి కూర్చున్నవాడు!