పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/31

ఈ పుటను అచ్చుదిద్దలేదు
22

కాళిదాస చరిత్ర

సౌభాగ్యసౌందర్యంబులేటికి కాల్చనా? ది పరమదుర్మాత్ముడైన నాగురువుచేసిన యపకారము. పరమూర్ఝుడైన నాతండ్రి, తేనెబూసిన కత్తివలెనున్న యావృద్ధపండితుని మాటాలు నమ్మి తనకు గీడు గలుగునని శంకించి తనయాపద నివారించుకొనుటకై తెగీతెగని బందికత్తితో నాగొంతుకోసినాడు. ఒకరిని నిందింపనేల? 'అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ ' మ్మను నార్యొక్తి కలదుగదా! నేజేసిన కర్మయొక్క ఫలము నేననుబవింపవలెనుగదా! గతించినదానికై విచారించిన ఫలములేదని పెద్దలు చెప్పుదురుగదా! కాబట్టి విచారించుటమాని దీనికి తగిన ప్రతిక్రియ చేసుకోవలయును" నని క్షణమాలొచించి మగనిజూచి యిట్లనియె. "మహాత్మా! మీరుజతముచేత బ్రాహ్మణులు కర్మచేత గిరాతకులైనను బ్రహ్మతేజము నుండి మీరుద్బవించిరి గావున సహజములైన తెలివితేటలు మీయందు గూఢముగానుండును. దిస్సహవాసములచేత నీవఱకుజేసిన దురాచారముల విడచి మీరు విద్యావంతులై సాధువులై గౌరవనీయులగుటకు నొక్క యుపాయము జెప్పెద నినుండు. వినెదరా!" అనవుడు నాబ్రాహ్మణ కిరాతకుడు "సెప్పుసెప్పు యింటాయింటా" యని యనుటయు, దనమగడు దారికి వచ్చుచున్నాడని యాకళ్యాణి లోలోపలసంతసించి వెండియు నిట్లనియ, "స్వామీ! ఈయూరిబైట గాళికాదేవి యాలయముగలదు. ఆమె భక్తవత్సలురాలు. రాత్రులయందామె తనయాలయము విడచి లోకసంచారార్ధమై యరుగును. తెల్లవాఱుజామున నామె మరల గుడికి జొచ్చును. ఇప్పుడు రెండుజాముల రాత్రికన్న నెక్కువకాలేదు. ఈ క్షణమే మీరక్కడికరిగి యాలయము బ్రవేశించి తలుపులు లోపల గడియ వైచికొని మేలుకొనికూర్చుండుడు. భగవతికాత్యాయని లోకసంచారము సమాప్తముచేసి నాలవజామున నాలయము