పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/28

ఈ పుటను అచ్చుదిద్దలేదు

19

కాళిదాస చరిత్ర


ఆహా! మూఢవిశ్వాస మెట్టియాపదలు దెచ్చునో చూచితిరా? రాజు యుక్తాయుక్త్గ వివేచనాజ్ఞానములేక గురువుయొక్క స్వభావమెఱుంగక వానిమాటలయందే విశ్వాసముంచుటచేత దన ప్రియపుత్రిక కిట్టిపాట్లు సంప్రాప్తించెను.

వివాహమంగళవిధి సలక్షణముఘా జరిగిన పిదప రాజు పుత్రికకు బునస్సందాన మహోత్సవము చేయించెను., బాలిక చెలికత్తెలు కొందఱు కమ్మసంపెంగ నూనెతో దలయంటి పన్నీట జలకమాడించి హోంబటు దువ్వలుపలు గట్టబెట్టి నవరత్నస్ధగితములైన సువర్ణ భూషణములు బెట్టి సింగారించిరి. మఱికొందఱు నాటి ప్రాత:కాలము మొదలుకొని పడకగదే బలువిధముల నలంకరించిరి. అదివఱకే గోడలమీద వ్రాయబడిన చిత్తరువులుతోడను, జిత్రవిచిత్రముగా బల్లలమీద నమర్చంబడిన బొమ్మ్లలతోడను, వెండిదీపస్ధంభముల మీద బంగారుప్రమిదలలో నత్తరు చమురుతో వెలుగుచున్న దీపములతొడను, గది యతిరమణీయంబై మన్మధుని కొలువుకూటమి వలె వర్ణింపరాని సౌందర్యము గలిగి విరాజిల్లుచుండెను. సాయంకాలము భోజనమైన తొడనే పెండ్లికొడుకు ముందుగదిలో బ్రవేశించి బల్ల మీది బంగారు పళ్లెరములలో దంపతుల నిమిత్తమై యమర్చబడిన పండ్లను, భక్ష్యములను. గడు పాఱ మెక్కి కఠినశిలమీద బండుకొనుటచే మిక్కిలి కర్కశ మైన తనమోటమెను రాజపురుషోచితమైన యా హంసతూలికా తల్పము పై జేర్చి క్షణములోనిద్ర పోయెను. సఖీజనులు రాజపుత్రికను మెల్లమెల్లగా శయనాగారముజేర్చి బుజ్జగించి తలుపులువైచి యావలకు జనిరి. జగన్మోహనాకారము గలిగి త్రైలోక్య రాజ్యలక్ష్మివలెను, మన్మధుని యాఱవ బానమువలెను, గాలుచేతులు మొదలగు