పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/20

ఈ పుటను అచ్చుదిద్దలేదు

11

కాళిదాస చరిత్ర

సమూహములును గలిగి కన్నులపండువును జెవులకు విందును జేయుచు నతి రమణీయంబై యుండును.

ఆ యాశ్రమమున మహానుభావుండైన చిరంతపుడను నొకముని దీర్ఘకాలమునుండి తపస్సు చేయుచుండెను. అతడు కొంతకాలము ధూమపాయియై యనగా పొగబీల్చి బ్రతుకుచు, మఱికొంతకాలము గాలిదిని జీవించుచు మఱికొంతకాలము జలభక్షణముచేత నుదరము నిండుకొనుచు, మఱికొంతకాలమాకులు, దుంపలు, గాయలు పండ్లుమెక్కి పొట్టబోసుకొనుచు మఱి కొంతకాలము నిరాహారుండగుచు, మండువేసవి కాలమున బంచాగ్నిమధ్యమునను, వర్షాకాలమున నింగికి నేలకు నేకధారగా నాకసము చిల్లులుబడునట్లు వానలు గురియునప్పుడు బట్టబయటను, జగమతయు గడగడ నడకించునట్టి శీతకాలమున నహోరాత్రములు ద్రేళ్ళవలెనుండు చన్నీరుగల తటాకములయందును నిలిచి కొన్నాళ్లూర్ద్వ బాహుడై, కొన్నాళ్లొంటికాలిమీద నిలిచి యుగ్రతపము జేసెను. అతని ఘోరతపము గాంచి మౌనులు కిమ్మనక యూరకుండిరి. వేల్పులు వెఱగొందిరి. విద్యాధరులు విన్నంబోయిరి. సిద్ధులు సిగ్గుపడిరి. సన్నగులు పాఱిపోయిరి, గరుడులు గడగడనడంగిరి. పదునాల్గులోకములు పల్లటిల్లెను. అష్టదిక్పాలకులు తమతమస్ధానంబుల నితడు తపొవైభవంబున నాక్రమించుకొనునని దిగులుజెంది యింద్రునితో మొఱబెట్టుకొనిరి. ఇంద్రునకు నట్టి భయమే గలుగుటంజేసి తనయాస్థాన వేశ్యలగు రంభాదులను రావించి గౌరవించి యిట్లనియె-- "సుందరులారా! మీవలన నాకొక్క ప్రయోజనము కలదు. అయ్యది మీరు తప్పక చేయవలయును. భూలోకంబున నొక మహర్షి చిరంతపు డనువాడు మహోగ్రతపము చేయుచున్నవాడు. ఈవఱకు దేవమానరాక్షసుల తపంబుల జూచితిమి గాని యింత లోకభయంకరముచేయు ఘోరతపము జేయువా