పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/17

ఈ పుటను అచ్చుదిద్దలేదు
8

కాళిదాసు చరిత్ర

అందఱు నైకంకర్యముగ నొప్పుకొనుచున్నారు. శా. రోలంబు రాజీయము మొదలగు నితర గ్రంధములు మఱియొక కాళిదాసుడు రచించియుండెనుగాని యీ కాళిదాసుడుగాదని వారి యభిప్రాయము నలోదయముగూడ కాళిదాస మహాకవిరచించిందేయని యొక ప్రతీతికలదు. రచిమలేదని స్పష్టపడుచున్నది. కధ చమత్కారముగా నుండుటచేనిందుదుహారింప బడుచున్నది.

కాళిదాసుకవిత్వము మిక్కిలి సరసమై, సులభమై, ద్రాక్షపండ్లవలె నుండుటంజేసి యీర్ష్య్తాగ్రహస్తులైన కొందఱు పండితులు వాని కవిత్వము యమకములు, శ్లేషలు మొదలగునవి లేక పేలవముగా నుండునని దొషారోపణసేయజొచ్చిరి. అటువంటికవిత్వము సహజముగా నతని కిష్టములేకపోయినను మూర్ఖులు తనయందారోపించిన దొషమును బావుకొనుటకును, యమకశ్లేషలతో గూడిన చిత్రకచిత్వముగూడ జెప్పగల సామర్ధ్యము తనకుగలదని లోకమునకు తెలియజేయుటకును నతడట్టికావ్యము జేయు బ్రయత్నము సేయుచుండ నంతలో వేశ్య హస్తమున నతనికి బలవర్మణము గలిగెను.

మరణానంతరమున నతడు పాంచాలదేశమున నొక బ్రాహ్మణునకు గుమారుడై పుట్టి చిన్ననాటనే విద్యాభ్య్తాసము చేయదొడగెను. పూర్వజన్మ సంస్కార విశేషమున విద్యలు తనకు సునాయాసముగా బట్టువడెను. అతని తండ్రియు విద్వాంసుడే. అతడాదేశపు రాజునింట ననుదినము బురాణము చెప్పుచుండెను. ఒకనాడాబ్రాహ్మణుడు కార్యాంతర ప్రసక్తిచేత రాజుగారితో మనవిసేయకయే గ్రామాంతరమునకు బోయెను. పురాణము జెప్పునట్టి వేళకు మరలరావచ్చునని యతని సంకల్పము. అనుకొన్నప్రకారము జరుగలేదు. ఆనాడు భయంకరమైన