పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/162

ఈ పుటను అచ్చుదిద్దలేదు

158

కాళిదాస చరిత్ర

గనుంగొని మిక్కిలి దు:ఖించెను. పరిచారికముఖమున నదిగ్రహించి రాజు వానియాంతరంగికులునచ్చోటికి బోయి చచ్చిపడియున్న భవభూతి శవముంజూచి రాజు తనవల్లనే యట్టిఘోరకృత్యము జరిగినదని విచారించి యట్టిప్రమారకరమైన శాస్త్రమునందు బరీక్షయిమ్మని యడుగుటలో దాను గొప్ప తప్పుచేసెనని తలంచి పశ్చాపపడి శ్లోకార్దమును రచియించిన భవభూతి యభిప్రాయమేమో తెలియగోరి మఱునాడాస్ధానకవులం బిలిపించి యది స్సమస్యగానిచ్చెను. ఆసమస్య యితరుల కసాధ్యమగుటచే కాళిదాసు డిట్లు పూరించెను:

    కిం చాతక: ఫల మపేక్ష్య సవజ్రపాతాం
    సౌరందరీం కలయతే పవనాధారం.

   తా॥ చాతకపక్షి యేమిఫల మపేక్షించి పిడుగుల పాటుతో గూడికొనినట్టి మేఘధారను గోరుదున్నది. అనగా లోకమునందు జక్కదనంపుటిక్కలగు లావణ్య్హనతం లెందఱోయుండగా వారితో సుఖింపలేక నరు డనేకాపాయములతో గూడిన స్దలములకేగి యచట నున్న కాంతల నేల గోరగలయునని భావము. 
   ఈసమస్యాపూరణమునకు రాజు మిక్కిలి సంతోషించెను. పండితులు మత్సరగ్రస్ధులగుటచే భవభూతి యభిప్రాయమదియై యుండదని వాదించిరి. అప్పుడు కాళిదాసుడు తోటికవులందఱు దనపై నీర్షవలన నట్లనుచున్నారని తెలిసి వారిమాత్సర్యమును, దన సామర్ద్యమును రాజునకు జూపదలచి తనకిష్టదేవతయై పలుసారులు బహువరంబులిచ్చి కాపాడిన భువనేశ్వరిని ధ్యానించి భవభూతిని బ్రతికింపుమని ప్రార్దించి యాతని తలయు మొండెము నొకటిగాగూర్చెను. అప్పుడు దేవీవరప్రసాదమున భవభూతి చైతన్యముగలిగి బ్రతికెను. అంతట గాళిదాసు భవభూతింజూచినీవుగోడపై శ్లోకార్దముమజ్త్రమే వ్రాసితివి. నీహృదయము మాకుదెలియలేదు శ్లోకములో దక్కినసగము