పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/160

ఈ పుటను అచ్చుదిద్దలేదు

151

కాళిదాస ఆచరిత్ర

కత్తెర భోను

భోజరాజు తన

యాస్థాన కవులనను

నాఱుశాస్త్రములయందు, నఱువదినాల్గుకళలయందు బరీక్ష యిమ్మనికోరెను. పండితులందఱునఱువదిమూడుకళలందుమాత్రము పరెక్షనిచ్చి మిగిలినదియగు జారత్వమునందు బిద్ధికుశలత చూపుటయగును. కావుననది దోష భూయిష్టమైనదనియు, నపకీర్తి కరంబనియు, విశేషించి ప్రాణాపాయము దెచ్ ఉననియు, నందుచేత ఇది పరీక్షనిచ్చుటకు వీలైనది కాదనియు వారుజెప్పిరి. కాని యిందులోగూడ నొకపండితుడైన బరీక్షనియ్యవలసినదని రాజు నిర్భందించుటచే వారొడొంబడి తమలో నసాధారణబుద్ధిసంపన్నతచేతనే గాక యగణ్యతారుణ్యములచేత నవమన్మధుడనిపేరువదసిన భవభూతిం పిలిచి జారత్వశాస్త్రమునందు రాజునకు నచ్వునట్లు పరీక్షయిమ్మని నియోగించిరి. భవభూతి తనకట్టికార్యమిష్టము లేకపోయినను రాజనిర్భందముచేతను దనమిత్రుని నిర్భంధముచేతను, నెట్టకేలకొడంబ్డియెను అట్లు కొంతకాలము గతించెను.

  ఒకనాడు భవభూతి, పూర్వము శివునికంటిమంటచే బూడిదయైన మన్మధుడు మరల భూమిమీద నవతరించెనోయని జనులు భ్రమపడునట్టి సుందరాకారముగలిగి రాజమంచిరసమీపముననుండి పోవుచుండ రాజునకు దగ్గఱచుట్టమైన యొకలా అణ్యవతి యాభవభూతిని గని మోహించి తమచెలిమచేయమని యాతనికడకు దూతికగా దనదాని నంపెను.ఆకళ్యాణి భువనైకసుందరి యగుటచే నామెసహవాసముచేత “నేకక్రియాద్వ్యర్ధకరీ” యన్నట్లు జారత్వశాస్త్రమందు బరీక్షనిచ్చుటయు, నింద్రియసుఖానుభూతియు నను రెండుపనులు జరుగునని