పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/151

ఈ పుటను అచ్చుదిద్దలేదు
142

కాళిదాస చరిత్ర

సంపాదించి బృహస్పతి సమానులైరి. మీకందఱకు క్షేమమా! మహారాజూగారు కుశలముగనున్నారా? నేను భోజరాజదర్శనముకొఱకు ధనకాంక్షినై కాశీనుండి వచ్చియుంటిని. నేను జట్టువాడను" ఆ మాటలువిని వారందఱునవ్విబైలుదేరిరి. అందులో నొక పండితుడు వానిమాట కుత్తరము చెప్పదలంచి తమకు రాజు సమస్యనిచ్చుటయు, నది తాము పూరింపలేకపోవుటయు, నాకారణమున రాజాజ్ఞచే దేశ భ్రష్టులగుటయు దెల్పెను. సమస్య మేమిటని చారణుం డడుగ నావిద్వాంసుడని చదివెను. అదివిని చారణుండు దాని యుత్తరార్దమిట్లు పూరించెను:

"అణు ఇది బంణయది, కహం అయికిది తిస్సప్పబడి చందప్ప?"

     సమస్యాపూరణము మిక్కిలి చమత్కారముగా నున్నదిని సంతసించి వారందఱు చారణునకు నమస్కరించి పాఱిపోవనవసరములేదని బండ్లు వెనుకకు దోలించుకొని మరల నిండ్లకుబొయి మఱునాడు రాజసభకరిగి  స్వస్తివాక్యములు బలికి యుచితాసనములపై గూర్చుండిరి. అప్పుడు బాణు డిట్లనియె.."దేవా! సర్వజ్ఞడైన మీమాట నీశ్వరుడొక్కడే యెఱుగగలడు. కుక్షింభరులమైన మే మెఱుగుటెట్లు ! అయినను దోంచినట్లు సమస్యాపూరణము చేసినాము. చిత్తగింపుడు.

 "తులణం అణు అణుపరఇ గ్లౌ మహచందస్సు సొక్షఏదావి. అణు ఇది బంణ యది, కహం అణుకిని తస్సప్పడిపడిచందస్సకి"

     తా॥పూర్ణచంద్రుడీ మెముఖమును జోలవచ్చును కాని వానికి నేత్రములులేవు. నచోవిలా సములు లెవు. నిశ్చయముగా సరిపోలునని చెప్పు చున్నాడుకాని, పాడ్యమినాటి చంద్రు డామె మొగము నెట్లు పోలును?
   అదివిని భొజుండు తన యభిప్రాయం సంపూర్ణముగా నచ్చినదని సంతసించి యది కాళిదాసుడె పూరించియుండవచ్చునని భావించి యాతడొకపూట ప్రయానదూరములో నుండవచ్చు నని యూహించి