పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/140

ఈ పుటను అచ్చుదిద్దలేదు

131

కాళిదాస చరిత్ర

   అదివిని కాళిదాసుడు నవ్వి "స్వామీ ! మీరు గొప్ప కవులే గాని చిన్న పొరబాటు చేసినారు. ఆడు లేడికి కొమ్ములుండవు కాబట్టి శృంగశబ్దముదీసివైచి తుండ శబ్దము బెట్టుము.తక్కిన రెండుపాదములు నేను పూరించితిని. చిత్తగింపుడు.

శ్లో॥పరిణతి రవిగర్భవ్యాకులా పౌరుహూతీ
     దిగపి ఘనకపోతీ హుకృతై క్రుందతీవ

తా॥సూర్యుడనుకొడుకు కడుపులో నుండుటచేత నిండు చూలాలై తూర్పుదిక్కనుకాంత పావురపు కూతలను నెపమున నొప్పులు పడుచున్నదో యనునట్లున్నది.

     అని కాళిదాసుడు సూర్యోదయమును వర్ణించెను. ఢక్కాకవి చంద్రాస్తమయము వర్ణించెను. ఆ శ్లోకమందలి కల్పన మిక్కిలి రమణీయముగా నుండుటచే ఢక్కాకవి మిక్కిలి యాశ్చర్యపడి  "నీవెవ్వడ" వని యడిగెను. "అయ్యా ! నేను కాళిదాసుగారి గుఱ్ఱపునాడ" నని యతడు బదులు చెప్పెను. ఆ మహాకవియొక్క గుఱ్ఱపువాడే యట్టి కవిత్వము చెప్పగలిగినాడు. కాళిదాసెంత ప్రతిభాశాలి  యైయుండునో యని భయపడి యాఢక్కాకవి చల్ల చల్లగా నాయూరువిడిచి పోయెను.

బా ధ తి

కా ళి దా సు ంస

కొకానొకప్పుడు

భోజునిపై గోపమురాగా ధారానగరముబాసి బోయపల్లెకు బోయి యచ్చట నతడు పల్లకులు మోయుచుండెనట! కాళిదాసుని వియోగము సహింప లేక భోజుడు మిక్కిలి పరితపించి తన యాస్దానకవీశ్వరుడుగా నున్న మహాకవి కట్టి దుర్దశ వచ్చినందుకు విచారించి యాతని నెట్లైన