పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/111

ఈ పుటను అచ్చుదిద్దలేదు
102

కాళిదాస చరిత్ర

నాశ్రయించిన పక్షమున నతడు భోజునితొ జెప్పి తకేదేని యుపకారమొనరించునేమొ యని యాసపడి ధారాపురికి బోయి యా కవిశేఖరుని దర్శనముచేసి తన దీనావస్దనంతయు వెళ్లబుచ్చుకొనెను. అదివిని కాలిదాసు మిక్కిలి విచారించి నీవు కవిత్వకేమేమైన జెప్పగలగా యని యడిగెను. అందుకు బ్రాహ్మను డిట్ల నియె, "అయ్యా! చదువుకు నాకు జాలదూరము పొట్టజించి కంచుకాగడాలువేసి వెదికినను నాకడుపులో నొక్క యక్షరమైన గనబడదు. ఇంటినిండ పిల్లలు ఏపూట కాపూట కుండ కాలుటయే కష్టముగా నున్నది. విద్వాంసుడ నైన పక్షమున నేనే రాజునాశ్రయించి సంపాదించుకొందును. నావంటి నిరక్షరకుక్షికి సాయముచేయుటయేఛేయు" టని బదులు చెప్పెను. వాని యవస్దవిని జాలినొంది కాళిదాసుడు వాని కేదేని సాయము చేయదలఫి "ఆర్యా! నేనేదో సాయముచేసెద రేపు రాజద్వారమునొద్ద మీరు కనిపెట్టి యుండుడు. రాజును, దేవతలను, చిన్నపిల్లలను, గురువును రిక్త హస్తములతో జూడగూడదు. కావున పండ్లో, కాయలో రాజునకు బహుమానముగా దీసికొనిరమ్ము" అని వానిని బంపెను.

     మఱునాడా బ్రాహ్మణుడు పెద్ద చెఱకుగఱ్ఱ నొకదానిని సంపాదించి, దానిని చిన్నముక్కలుగా విఱిచి వాటిని దనకొల్లాయిగుడ్దనుజుట్టబెట్టి రాజద్వారముకడ గూర్చుండెను. అతడు పెద్దమ్మకు బెంపుడుకొడుకగుటచేత 'నిర్బాగ్యునకు నిద్ర ' యన్న లోకోక్తిప్రకారము కునికిపాట్లువచ్చెను. చెఱుకుముక్కల కట్ట తలగడ జేసికొని యతడు గుఱ్ఱుపట్టి నిద్రబొయెను. చెఱకుముక్కలు చూచి నోరూరుటచే వానికన్న నిర్భాగ్యుడొకడు కాగి చల్లారిన కొఱవులు తెచ్చి చెఱకు ముక్కలు తాను లాగి యా కొఱవులు నంగవస్త్రమున జుట్టి యతని తలక్రింద బెట్టెను. మనభ్రాహ్మణుడు కలియుగ కుంబకర్ణు డగుటచే నదియేమియు నెఱుగక తనదారిని దాను బుసకొట్టుచుండెను.