పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/103

ఈ పుటను అచ్చుదిద్దలేదు
94

కాళిదాస చరిత్ర

      తా॥పాండవులు ద్రౌపదికి భర్తలు, బావలు, మఱుదులు, ధర్మరాజెన్నడు మఱది కాడు. సహదేవు 

డెన్నడు బావకాడు.

    వేదవ్యాసు డాశ్లోకమువిని  సంతసించి తాను చేసిన చకార ప్రయోగములను హేతువులు చెప్పి కాళిదాసు నొడంబఱచి యతనికి వరములిచ్చి దీవించి పంపెను.

స మ స్యా పూ ర ణ ము

సాహస విక్రమార్కుడు

మాఱువేషము వేసికొని తన

రాజ్యమందలి నానాభాగములకు బోయి దేశపరిస్దితు లెట్లున్నవొ స్వయముగా జూచుకొని రాజ్యపాలనము జేసెనని వాడుకగలదు. భోజమహారాజుగూడ నట్లే పరులు తన్నెఱుగకుండ మాఱువేషములు వేసికొని దేఋశమంతయు దిరుగుచు నొకనాడొక గ్రామమునకు బోయి యొక బ్రాహ్మణుని యింట బసచేసెను. ఆ గృహయజమానుడు వేదాధ్యన సంపన్నుడు, నిరతాగ్నిహోత్రి ఆయని యిల్లాలు పరమ సాధ్వి ఈలోకంకులో మగనికంటె దైవము వేఱులేరని నమ్మి యతని యడుగులు గొలుచుచు లోకులందఱు గొనియాడునట్లు శాంతి గలిగి సంతుష్టి గలిగి సంతుష్టిగలిగి సంసారము చేయుచుండెను. భోజుడు బసచేసిన నాటిరాత్రి పగలెల్ల నెందెందొ తిరిగి యామెభర్త మిక్కిలి పాటుబడి యింటికివచ్చెను. ఆ మహాపతివ్రత భర్తకెదురుగా బోయి సకలోపచారములు చేసి తనయింటగలిగినకొలది పెందలకడ వంటకముచేసి యారగింపజేసి పానుపు వైచి భర్తను బండుకొనంబెట్టి తాను భోజనము చేయకయే మగని పాదములనొత్తుచు గూరుచుండెను. భర్త గాఢముగ నిద్రించుచుండెను. ఆమె కుమారుడు రెండేండ్ల ప్రాయమువాడు.