పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/100

ఈ పుటను అచ్చుదిద్దలేదు

91

కాళిదాస చరిత్ర

          అంతట వారు తత్కార్యమునకు సుముహూర్తము నేర్పఱచి "అదౌపూజ్యోగణాధిప:" యనునార్యోక్తినిబట్టి ముందుగా విఘ్నేశ్వర పూజ చేయుచుండిరి. అపుడొక చిలుక సమీప వృక్షశాఖపై గూర్చుండి "నవనవ"యని కూయదొడగెను. మహా కార్యము ప్రారంభించినప్పుడు పులుగుకూత దుశ్శకునమని యానాటికి వారు విరమించి  మఱియొక దినమున వేదసంస్కరణమారంభించిరి. ఆ దినమున గూడ వారందఱు జేరంగానే యెప్పటియట్లు శుకమువచ్చి వారి యెదుటనున్న చెట్టుమీద కూర్చుండి "నవనవ" యని కూసెను. ఆనాడుకూడ వారు పనిమానిరి. కాని ప్రతిసారియు "నవనవ"యని చిలుక కూయుట కేమికారణమని వారు వితర్కింపజొచ్చిరి. దాని యర్ద మెవ్వరికిని బొధపడలెదు. మూడవనాడుకూద దండి ప్రముఖులు చేరి వేదసంస్కరణమునకు బ్రయత్నించుచుండ మరల నాపక్షి వచ్చి "నవనవ" యనియెను. అక్కడికి కాళిదాసు వచ్చి "పంచపంచ" మని యా పక్షి కుత్తరమిచ్చెను. అప్పు డాచిలుక యెగిరిపోయెను. చిలుకమాటలకుగాని, కాలిదాసు మాటలకుగాని, యర్దము దెలియక పండితులు కొట్టుకొనుచుండిరి. అప్పుడు కాళిదాసు వారి కిట్లనియె.
      "అయ్యా! ఇది సధారణమైన చిలుకకాదు. వేదములు విభాగించిన సాక్షాన్నారాయలణ స్వరూపు డగు వ్యాసుడు. మనపండితులు యహంభావ మణచుటకై  యీ శుకరూపమున వచ్చెను. మన తల దన్నిన పండితులు వందలువేలు పూర్వముండిరి. వారెవ్వరు వేదమునందు దోషములు దిద్దుటకై ప్రయత్నించలేదు. నేటికాలమునకు మీరు బైలుదేఱి యీవిరుద్ద ప్రయత్నములు చేయుచున్నారు. అందుకు భగవానుడైన బాదరాయణుదు చిలుకయైవచ్చి "నవనవ" యని యడుగుచున్నాడు. మన మైదు వ్యాకరణములు మాత్రమే చదివితిమిగనుక "పంచపంచ" యని నేనుత్తరము చెప్పితిని. మనము