ఆకృతి రచన- ఆధునిక నిర్మాణ ద్రవ్యములు
సురవరం ప్రతాపరెడ్డిగారు, (2) శ్రీ. బూర్గుల రామకృష్ణారావుగారు, (3) శ్రీ పులిజాల వేంకట రంగారావుగారు, (4) శ్రీ మాడపాటి హనుమంతరావు గారు, (5); శ్రీ కొండా వేంకటరంగారెడ్డిగారు, (6) శ్రీ మందుముల నరసింగరావుగారు, (7) శ్రీ మందుముల రామచంద్రరావుగారు, (8) శ్రీ రావి నారాయణరెడ్డి గారు, (9) శ్రీ మాదిరాజు రామకోటేశ్వరరావుగారు, (10) శ్రీ కొండా వేంకటరంగారెడ్డిగారు, (11) శ్రీ రావి నారాయణ రెడ్డిగారు, (12) (అ) శ్రీ మందుముల నరసింగరావు గారు, (ఆ) శ్రీ బద్దం ఎల్లా రెడ్డిగారు, (13) కీ. శే. జమలాపురం కేశవరావుగారు. వీనితో పాటు జరిగిన పది మహిళా సభలకు శ్రీమతులు నడింపల్లి సుందరమ్మ, టి. వరలక్ష్మమ్మ, ఎల్లాప్రగడ సీతాకుమారి, మాడపాటి మాణిక్యమ్మ, బూర్గుల అనంతలక్ష్మీదేవి, నందగిరి ఇందిరాదేవి, యోగ్యశీలాదేవి, రంగమ్మ, ఓబుల రెడ్డిగారలు అధ్యక్షత వహించిరి.
పోలీసుచర్య తరువాత ఆంధ్రోద్యమములో మరొక అధ్యాయము ప్రారంభమైనది. ఆనాడు 1936 లో అప్పటి హైదరాబాదు హోం సెక్రటరీ ఆంధ్రోద్యమము ఆంధ్ర - తెలంగాణాల ఏకీకరణ ఉద్యమముగా రూపొందగలదని వెల్లడించిన అనుమానము పోలీసుచర్య తరువాత సత్యమైనది. పోలీసుచర్య తరువాత ఘనపురంలో జరిగిన హైదరాబాదు ఆంధ్రప్రాంత కాంగ్రెస్ సంఘ సమావేశములో ఆంధ్ర-తెలంగాణాల ఏకీకరణము జరుగవలెనని తీర్మానించబడినది. ఈ తీర్మానమును గోలకొండ మొదలైన తెలుగు పత్రికలు ఆమోదించి హర్షించినవి. నిజామాబాదునందు జరిగిన హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెస్ సమావేశమందు హైదరాబాదు విభజనము జరిగి ఆంధ్ర - తెలంగాణాల ఏకీకరణము జరుగవలెనని అర్థము నిచ్చు తీర్మానము చేయబడినది. ఈ తీర్మానమునే 2–6–1953 నాడు హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెస్ పునరుద్ఘాటించినది. ఈ విధముగ పోలీసుచర్య తరువాత నుండి జూన్ నెల 1954 వరకు హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెస్, కమ్యూనిస్టుపార్టీ, సోషలిస్టుపార్టి, ఇతర రాజకీయ పక్షాలు విశాలాంధ్ర స్థావనను బలపరచినవి. ప్రత్యేకముగ విశాలాంధ్రో ద్యమము ప్రారంభమైనది. విశాలాంధ్ర మహాసభ' అవతరించి ఆంధ్ర తెలంగాణాల ఏకీకరణము కొరకు కృషి సాగించినది. జూన్ 1954 లో హైద్రాబాదు ప్రదేశ్ కాంగ్రెస్ లో ఒక వర్గము ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావలెనను వారమును లేవదీసినది. తత్ఫలితముగ హైద్రాబాదు ఆంధ్ర రాజకీయరంగమున విశాలాంధ్ర వర్షము, తెలంగాణా వర్గము అను రెండు పక్షాలు బయలుదేరినవి. ఉభయపక్షాల వాదనములు భారతప్రభుత్వమునకు అంద జేయబడినవి. హైదరాబాదు శాసనసభలో అధికసంఖ్యాకులు విశాలాంధ్రమును బలపరచినారు. అఖిలభారత కాంగ్రెస్ కార్యవర్గము ఆంధ్ర- తెలంగాణాల వికీకరణము జరుగవలెనని సలహా నిచ్చినది. అందుచేత హైదరాబాదు రాజధానిగ ఆంధ్ర- తెలంగాణాల ఏకీకరణ అతిత్వరగా జరిగి సమగ్ర ఆంధ్రరాష్ట్రము 1956 అక్టోబరు నాటికి అవతరింపగల అవకాశాలు సంపూర్ణముగ అగుపించెను. ఢిల్లీలోని రాజ్యసభలో ప్రసంగించుచు, కేంద్రప్రభుత్వ దేశీయ వ్యవహారాల మంత్రి అందరి ఆమోదముతో విశాలాంధ్రము ఏర్పడగలదని ప్రకటించినారు (23-2-1956). భారత నాయకాగ్రేసరులు ఆశీస్సులతో 1956 నవంబరు 1 వ తారీఖున దీపావళి పర్వదినమున ఆంధ్ర-తెలంగాణాలు ఏక రాష్ట్రముగ, “ఆంధ్రప్రదేశ్” నామముతో ఏర్పాటు చేయబడినవి. “ఆంధ్రప్రదేశ్" కు హైదరాబాదు నగరము రాజధాని యైనది. ఇందువలన నూటయేబది సంవత్సరాల క్రింద ఇంగ్లీషు రాజ్యవిస్తరణ ఫలితముగా విడిపోయిన మూడుకోట్ల ఆంధ్రులు తిరిగి ఏక పరిపాలన క్రిందికి వచ్చి కృష్ణాగోదావరీ నదుల జలాలతోపాటు, తెలుగు సీమలోని ప్రకృతిసంపదను తెలుగుప్రజల అభ్యుదయము కొరకు వినియోగించి "ఆంధ్రావళికి మోదము” కలుగునటుల సకలాంధ్రము యొక్క సర్వతోముఖాభివృద్ధికొరకు ప్రయత్నించు అవకాశాలు లబ్ధమైనవి. "ఆంధ్రప్రదేశ్ " భారత దేశమునకు పెట్టనికోటయై ఆసేతు హిమాచల భూభాగమున ఒక సుందర నందనవనముగా శోభిల్లగలదని ఆశింపవచ్చును,
దే.రా.
ఆకృతి రచన-ఆధునిక నిర్మాణ ద్రవ్యములు :-వాస్తుశాస్త్రము ఎచ్చటనైనను, భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణములు, భూగర్భ పరిస్థితి, మత సాంఘిక రాజకీయ