పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

వ్రి॥ పరగిన మల్లిదేవజనపాలుండు పొత్తపిచోడవంశశే
ఖరుం డినవంశకర్త్త యనంగాం గడు వాలి విరోధిరాజసం
హరణుండు దొంటితాతలక్రియం దగుపొత్తపి రాజధానిగా
ధర సకలంబు నేలె విదితంబగు బాహుపరాక్రమంబునను.

17


క.

ఆమల్లిదేవనికిం గుల
భామాతిలకంబు పుణ్యభాగిని గౌరీ
శ్రీమహదేవికిం బుట్టెం ద
పోమహిమఫలమ్ము దాన పొడ వైనగతిని.

18


క.

ఇనుం డుదయ మైన య ట్ల
మ్మను వుదయం బైనయట్లు మఱి రఘురాములు
జనియించ్చినట్లు గులవ
ర్ద్ధనుం డోపిలిసిద్ధివిభుండు దా నుదియించ్చెను.

19


మ.

వ్రి॥ కరికాలోత్తమరాజవంశమునం దా గౌరీమహాదేవికిని
సురభులు గల్పకుజాతములు రసనదీతో(యంబు)[1] సింత్తామణులు
ధర నేకాక్రితిం బుట్టెనో యన జగదాంక్గుండై[2] యిచ్చు దీ
నుర కియ్యోపిలిసిద్ధివల్లభుండు గర్న్నుం దన్ను వర్న్నింపంగా[3] ను.

20


ఉ.

ఓపిలిసిద్ధివల్లభు జయోన్నతుం డేంకణచక్రవర్త్తి నా
జ్ఞాపరిరక్షితాఖిలదిశావలయును ఘనదానకర్న్ను లీ
లాపరిపూర్న్న[4]రమ్యశుభలక్షణమూర్త్తి జయంత్తు నశ్వసి
క్షా[5]పురుహూతుం బేరుకొనంగాం జనుం జోడకులైకభూషణును.

21
  1. సురనదీస్తోమంబు
  2. జగద్ధానాంక్కుండై
  3. గర్ణ్నుం దన్ను వర్ణ్నింపంగా
  4. కర్ణ్ను లీలాపరిపూర్ణ్న
  5. శిక్షా