పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/86

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్దండ్డుండు దాం బదుమువ్వుర
గండ్డం డనుధార నిలిపెం గటకములోనను.

11


చ.

వ్రి॥ బిరుదనం జన్నయాతెలుంగుబిజ్జనమనుమండు[1] మల్లిదేవం డ
చ్చెరు వగుచున్న పొత్తపియ చెన్నగువీడుగ వాలి పాకనాం
డిరువదియొక్కవేయిం జన నేలుచు బల్లహుదండ్లు గెల్చి త
త్కరివరకుంభమౌక్తికలతాతతిం బూచె నిజాసిపుత్రికను.

12


చ.

అతనికిం బుట్టి రొప్ప మధురాంత్తకపొత్తపిచోడసిద్ధిభూ
పతియును మల్లిదేవండును బాహుపరాక్రమవిక్రమక్రములు
నతవరనాథభాల[2]కషణస్థిరపాదసరోజవైభవులు
వితతసముద్రకాంచ్చిపరివేష్టితభూపరిరక్షణక్షములు.

13


క.

క॥ ధరం బొత్రపి[3]సిద్ధినరే
శ్వరునికి నుదియించ్చి భూమి సన నేలిరి స
చ్చరితులు పొత్తపిసోమీ
శ్వర[4]దేవండు మల్లిదేవవసుధాధిపుండును.

14


ఉ.

వ్రి॥ భూపదిలీపుండై పరగుపొత్తపిసిద్ధని తమ్ము మల్లధా
త్రీపతికిని సమస్తజగతీపతికిని సుతు లుద్భవించ్చి రా
శాపరిపూర్న్న[5]కీర్త్తులు భుజాబలవత్తులు నైన తొంట్టియ
య్యోపిలిసిద్ధియుం గులసముద్ధరణుం డగుమల్లిదేవండును.

15


క.

క॥ ఆపొత్తపిసోమీశ్వర[6]
భూపతికిం దమ్ము మల్లభూపాలున క
య్యోపిలిసిద్ధికిం దమ్ముండు
దీపితసితకీర్త్తి మల్లిదేవండు వరగెను.

16
  1. మన్మండు
  2. ఫాల
  3. బొత్తపి
  4. సోమేశ్వర
  5. పూర్ణ్న
  6. సోమేశ్వర