56
శ. స. 1131
(ఈ శాసనము గుంటూరుమండలమందు సత్తెనపల్లితాలూకాలో వేల్పూరిగ్రామమందు శ్రీరామలింగేశ్వరస్వామియాలయము వెలుపలిమండపములో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది - Government Epigraphist's list No 554 of 1925)
చ. | శకసమములు మహీగుణవృషధ్వజసంఖ్యగం జైత్రకృష్ణప | 1 |
| శ్రీమన్మహామండలేశ్వర కోటకేతరాజులు భోగస్త్రీ కసది | |
(అసంపూర్తి)
—————
57
శ. స. 1140 ప్రాంతము
(ఇది కృష్ణామండలము నందిగామతాలూకాలోని మోగల్లుగ్రామమందు వేణుగోపాలస్వామిగుడియెదుట నున్నఱాతిమీఁది శాసనభాగము. శాసనసంవత్సర మున్నభాగము ఖిలమైపోయినది. కాని గద్యభాగములో నీదానము కాకతీయగణపతిదేవుని పుణ్యమునిమిత్తము చేయఁబడిన ట్లున్నది. కావున, శాసనము శ. స. 1140 ప్రాంతమునాఁటి దనవచ్చును. Government Epigraphist's Collection Nos. 265-67 of 1924.)
శా. | శ్రీమంతుం డగుబచ్చునామయం బ్రభాశ్రీరమ్యు శ్రీరాముం దే | 1 |